నందిగామ గాంధీ సెంటర్ మరియు నందిగామలోని పరిసర ప్రాంతాల్లో వార్డుల్లో అకాల వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిల్వవుతోంది. రోడ్లు సమతుల్యంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయి, బయటకు వెళ్లే మార్గం లేకుండా ఉంది. ఈ కారణంగా వాహనదారులు, పాదచారులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.
అదేవిధంగా, నిలిచిపోయిన నీటి కారణంగా దోమల పెరుగుదలతోపాటు ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్లపై నిలిచిపోయిన నీరు తొలగించే చర్యలు తీసుకోవాలని, గుంతలను పూడ్చి నీరు సులభంగా వెళ్లిపోయే విధంగా డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించాలని నందిగామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నందిగామ గాంధీ సెంటర్ వద్ద రోడ్లపై వర్షపు నీరు నిల్వసమస్య
నందిగామ గాంధీ సెంటర్ మరియు నందిగామలోని పరిసర ప్రాంతాల్లో వార్డుల్లో అకాల వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిల్వవుతోంది. రోడ్లు సమతుల్యంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయి, బయటకు వెళ్లే మార్గం లేకుండా ఉంది. ఈ కారణంగా వాహనదారులు, పాదచారులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. అదేవిధంగా, నిలిచిపోయిన నీటి కారణంగా దోమల పెరుగుదలతోపాటు ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్లపై నిలిచిపోయిన నీరు తొలగించే చర్యలు తీసుకోవాలని, గుంతలను పూడ్చి నీరు సులభంగా వెళ్లిపోయే విధంగా డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించాలని నందిగామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

