నందిగామ పార్టీ కార్యాలయం లో నందిగామ మండల స్థాయి, అలాగే కంచికచర్ల మండల పరిటాల గ్రామంలో పార్టీ నాయకులు చింతా రవీంద్ర నివాసంలో కంచికచర్ల మండల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశాలకు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ డా.మొండితోక జగన్మోహనరావు హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు. డా.జగన్మోహనరావు మాట్లాడుతూ, గ్రామ మరియు బూత్ స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక పరిశీలకుడు, అలాగే నాలుగు గ్రామాల క్లస్టర్‌కు ఒక మండల స్థాయి పరిశీలకుడిని నియమించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అదేవిధంగా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నందిగామ, కంచికచర్ల మండలా ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం
నందిగామ పార్టీ కార్యాలయం లో నందిగామ మండల స్థాయి, అలాగే కంచికచర్ల మండల పరిటాల గ్రామంలో పార్టీ నాయకులు చింతా రవీంద్ర నివాసంలో కంచికచర్ల మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ డా.మొండితోక జగన్మోహనరావు హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు. డా.జగన్మోహనరావు మాట్లాడుతూ, గ్రామ మరియు బూత్ స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక పరిశీలకుడు, అలాగే నాలుగు గ్రామాల క్లస్టర్‌కు ఒక మండల స్థాయి పరిశీలకుడిని నియమించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

