నందిగామ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నూతన సంవత్సర శుభాకాంక్షలతో కళకళలాడింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయానికి వచ్చిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు, అధికారులు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి, సంక్షేమం కలగజేయాలని ఆకాంక్షించారు. కూటమి పాలనలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



