Story highlights
- ఉదయగిరి: దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మలేరియా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- ఇందులో భాగంగా గండిపాలెం, మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో గంబూషియా చేపలను విడుదల చేశారు.
- మలేరియా అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఉదయగిరి: దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మలేరియా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గండిపాలెం, మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో గంబూషియా చేపలను విడుదల చేశారు. మలేరియా అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గంబూషియా చేపలు నీటిలోని దోమల లార్వాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా దోమల వృద్ధిని సహజసిద్ధంగా నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.