Sunday, 22 March 2026
  • Home  
  • దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం
- తూర్పు గోదావరి

దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు ఈ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రెండు కార్లు వేగంగా ఢీకొట్టుకోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదం గురించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. End

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూ.గో.జిల్లా: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు ఈ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రెండు కార్లు వేగంగా ఢీకొట్టుకోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదం గురించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.