Sunday, 5 April 2026
  • Home  
  • దిగువరామాపురంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం..!
- తిరుపతి

దిగువరామాపురంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం..!

నూతన పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి దంపతులు గ్రామస్తులతో మమేకమై కల్యాణం తిలకించిన చెవిరెడ్డి పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం మండలం సి.రామాపురం గ్రామ పంచాయతీ దిగువ రామాపురంలోని శ్రీరామాలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు తీసుకు వచ్చిన చెవిరెడ్డి దంపతులకు గుడి కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు స్వాగతం పలికారు .వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామ స్మరణల మద్యన కల్యాణోత్సవం వేడుకగా సాగింది. అనంతరం గ్రామస్తులతో మమేకమైన చెవిరెడ్డి అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి బాగోగులు అడగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలసి చెవిరెడ్డి దంపతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. *చెవిరెడ్డి దంపతులకు సత్కారం* శ్రీ సీతారాముల కల్యాణోత్సవంకు ముఖ్యతిథులుగా హాజరైన చెవిరెడ్డి దంపతులను గ్రామస్తులు శాలువతో ఘనంగా సత్కరించడంతో పాటు కల్యాణోత్సవంకు ఉపయోగించిన అక్షితలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నూతన పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి దంపతులు
గ్రామస్తులతో మమేకమై కల్యాణం తిలకించిన చెవిరెడ్డి

పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం మండలం

సి.రామాపురం గ్రామ పంచాయతీ దిగువ రామాపురంలోని శ్రీరామాలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు తీసుకు వచ్చిన చెవిరెడ్డి దంపతులకు గుడి కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు స్వాగతం పలికారు .వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామ స్మరణల మద్యన కల్యాణోత్సవం వేడుకగా సాగింది. అనంతరం గ్రామస్తులతో మమేకమైన చెవిరెడ్డి అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి బాగోగులు అడగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలసి చెవిరెడ్డి దంపతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
*చెవిరెడ్డి దంపతులకు సత్కారం*
శ్రీ సీతారాముల కల్యాణోత్సవంకు ముఖ్యతిథులుగా హాజరైన చెవిరెడ్డి దంపతులను గ్రామస్తులు శాలువతో ఘనంగా సత్కరించడంతో పాటు కల్యాణోత్సవంకు ఉపయోగించిన అక్షితలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.