Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

దళితుల్లో అసమానతలు తొలగాలంటే పార్టీలకు అతీతంగా దళితులు ఐక్యంమై ఉద్యమించాలి

Punnami Newsroom Published:
దళితుల్లో అసమానతలు తొలగాలంటే పార్టీలకు అతీతంగా దళితులు ఐక్యంమై ఉద్యమించాలి

Story highlights

  • చెన్నరావుపేట : (పున్నమి తెలుగు దినపత్రిక ) దళిత మేధా శక్తి చెన్నారావుపేట మండల అధ్యక్షుడుగా శ్రీ పసునూరి నవీన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోట్ల పవన్ - న్యాయవాది గారు దళిత మేధా శక్తి చెన్నారావుపేట…
  • భారత రాజ్యాగంపై మరియు దళితల అభ్యున్నతి కొరకు ప్రస్తుతం ఉన్న భారత చట్టాలపైన దళితులకు పూర్తి అవగాహన లేనందున చైతన్యం కావడంలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
  • భారత రాజ్యాంగంపై మరియు ఇతర చట్టలపై ప్రతి దళితునికి చేరువచేయడమే దళిత మేధా శక్తి ముఖ్య ఉద్దేశ్యమని వారు అన్నారు.

చెన్నరావుపేట : (పున్నమి తెలుగు దినపత్రిక )

దళిత మేధా శక్తి చెన్నారావుపేట మండల అధ్యక్షుడుగా శ్రీ పసునూరి నవీన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోట్ల పవన్ – న్యాయవాది గారు
దళిత మేధా శక్తి చెన్నారావుపేట మండల అధ్యక్షులుగా కోనాపురం గ్రామానికి చెందిన వ్యక్తి, దళిత, బహుజన ఉద్యమాలల్లో క్రియకీలకంగా పనిచేసి సామాజిక సృహ కలిగిన వారు, దళితుల చైతన్యం కొరకు తరితపించే వ్యక్తి శ్రీ పసునూరి నవీన్ గారిని దళిత మేధా శక్తి చెన్నారావుపేట మండల అధ్యక్షులుగా ప్రకటించిన దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోట్ల పవన్ – న్యాయవాది గారు పేర్కొన్నారు
ఈ సందర్భంగా దళిత మేధా శక్తి వ్యవస్థపాక అధ్యక్షులు శ్రీ బోట్ల పవన్- న్యాయవాది గారు పాల్గొని మాట్లాడుతూ దళిత జీవితాల్లో నెలకొన్న అసమానతలు పోవాలంటే దళితులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం అయి తమ హక్కుల కొరకు ఉద్యమించాలని దళిత సమాజాన్ని కోరారు. భారత రాజ్యాగంపై మరియు దళితల అభ్యున్నతి కొరకు ప్రస్తుతం ఉన్న భారత చట్టాలపైన దళితులకు పూర్తి అవగాహన లేనందున చైతన్యం కావడంలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంపై మరియు ఇతర చట్టలపై ప్రతి దళితునికి చేరువచేయడమే దళిత మేధా శక్తి ముఖ్య ఉద్దేశ్యమని వారు అన్నారు. భవిష్యత్ కాలంలో దళితుల స్థితిగతులు మారాలంటే దళితులు ఏమి చేయాలి, ఇలా జరుగుటకు కారకులు ఎవరు అనేది దళితులకు తెలియజేస్తూ దళిత మేధావులు, ప్రొపెసర్లతో ప్రతి దళిత పల్లెల్లో అవగాహన, శిక్షణ తరతులు నిర్వహించి దళితులను చైతన్యం చేస్తామని దానికి అన్ని గ్రామాలలో ఉన్న దళిత సమాజంలో ఉన్న దళిత బుద్దిజీవులు సహకరించాలి వారు కోరారు. దళితుల భవిష్యత్ కొరకు తప్పా ఏ ఇతర స్వార్ధ, వ్యక్తిగత ప్రజయోజన కొరకు పనిచేయని వారి కోసమే దళిత మేధా శక్తి ఎదురుచూస్తుందని, తప్పకుండా అలాంటి వారు మాతో కలిసి రావాలి వారు కోరారు
ఈ సమావేశంలో దళిత మేధా శక్తి వ్యవస్థాపక ఆవిర్భావ సభ్యులు శ్రీ అడ్డ రాజు గారు, పెంబర్తి శ్రీనివాస్ గారు, కనకం నవీన్ గారు, జన్ను సాగర్ గారు, బోట్ల దయాకర్ గారు, మాట్ల మహేష్ గారు, గంగారపు వినయ్ గారు, నత్తి చిరంజీవి గారు, కొయ్యడ కుమారస్వామి, దుగ్గొండి మండల అధ్యక్షులు శ్రీ కుక్కమూడి గోవర్ధన్ గారు, నల్లబెల్లి మండల ఆఫ్యక్షులు శ్రీ జన్ను కర్ణాకర్ గారు తదితరులు పాల్గొన్నారు

News Sources

  • PraveenPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *