పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 21 : మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జలపల్లి మున్సిపాలిటీ, తుక్కుగూడ మున్సిపాలిటీ, పరిధిలో త్రాగునీటి సరఫరా సమస్యలపై హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవలి కొన్ని రోజులుగా పలు కాలనీల్లో త్రాగునీరు అనుకున్న స్థాయిలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే చర్యలు తీసుకొని తక్షణమే ఆయా ప్రాంతాలకు త్రాగునీరు అందించాలని ఆమె ఆదేశించారు. ప్రజలకు నిరంతరంగా సరిపడినంత మంచి నీరు అందించేందుకు అదనపు పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. నీటి సరఫరాను మరింత బలోపేతం చేసి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఎస్ టి పి పనులకు కూడా ఆరా తీశారు ఎమ్మెల్యే స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో హెచ్ఎండబ్ల్యూఎస్ డైరెక్టర్ సుదర్శన్, సుజాత, చీఫ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ నిసార్ అహ్మద్, సిజిఎం సంతోష్ కుమార్, కోడి, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్, మణికొండ శ్రీనివాస్ రెడ్డి సిజిఎం తదితర అధికారులు పాల్గొన్నారు.

*త్రాగునీరు సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోండి – ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *