Monday, 8 December 2025
  • Home  
  • తెలుగుదేశంలో బీసీలకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే కాకర్ల
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగుదేశంలో బీసీలకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే కాకర్ల

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. సీతారామపురం మండల సొసైటీ అధ్యక్షుడిగా సోమనబోయిన రాజశేఖర్ ను నియమించబడిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సొసైటీ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు పెనుబడి రఘురాములు, గొల్లపల్లి భాస్కర్లను శాలువా లతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఎంతో నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు శనివారం నిర్వహించిన భారీ ర్యాలీ కు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీతారామపురం మండలంలోని అభివృద్ధి సంక్షేమం పై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గడిచిన 14 నెలల్లో సుమారు 60 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దాహార్తిని తీరుస్తున్నామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 50 కోట్లతో సీసీ రోడ్ల పనులు, 12 కోట్లతో విద్యారంగం అభివృద్ధి పై ఖర్చు చేశామన్నారు. వింజమూరు లో డయాలసిస్ కేంద్ర ఏర్పాటు, సుమారు 6 కోట్ల రూపాయలతో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందన్నారు. సీతారామపురం, ఉదయగిరి మండలాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేలా కార్పొరేటర్ వైద్యం అందేలా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో సీతారామపురం మండల మాజీ జెడ్పిటిసి కలివెల జ్యోతికి మెంబర్ గా చోటు కల్పించి ఆమె సూచనలతో సీతారామపురం ప్రాంత ప్రజల కు వైద్య సదుపాయాలు సకాలంలో అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తెలుగుదేశంలో యువకులకు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని అందులో భాగంగానే సీతారామపురం మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజా, యువబినాయకులు చింతల శ్రీను లను టిడిపి ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని, సీతారామపురం అభివృద్ధిలో వారి పాత్ర కీలకమన్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజకీయంగా ఆర్థికంగా పూర్తిగా వెనక్కి నెట్టేసిందని, కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి పొందుతూ ముందుకు వెళుతుందన్నారు. వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లలో నియోజకవర్గంలోని 143 పంచాయతీలలో కనీసం పంచాయతీల నిధులు లేని పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలకు నిధులు కేటాయించి పంచాయతీల అభివృద్ధికి తోడ్పడిందన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నిటిని అమలు చేసి ప్రజల ఆదరణాభిమానాలు పొందిందన్నారు. కేవలం టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందినదని,మిగిలిన వారు ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తూ కాలాన్ని గడిపేసారన్నారు. రాష్ట్రంలో వైసిపి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాబోయే స్థానిక ఎన్నికలలో మరోసారి వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పి నియోజకవర్గంలోని 143 పంచాయతీలను, ఎంపీటీసీలు, జడ్పిటిసి లను గెలుచుకుంటామనే నమ్మకం ఉందని ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ సభ, కార్యక్రమం నిర్వహించినా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. సీతారామపురం మండల సొసైటీ అధ్యక్షుడిగా సోమనబోయిన రాజశేఖర్ ను నియమించబడిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సొసైటీ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు పెనుబడి రఘురాములు, గొల్లపల్లి భాస్కర్లను శాలువా లతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఎంతో నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు శనివారం నిర్వహించిన భారీ ర్యాలీ కు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీతారామపురం మండలంలోని అభివృద్ధి సంక్షేమం పై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గడిచిన 14 నెలల్లో సుమారు 60 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దాహార్తిని తీరుస్తున్నామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 50 కోట్లతో సీసీ రోడ్ల పనులు, 12 కోట్లతో విద్యారంగం అభివృద్ధి పై ఖర్చు చేశామన్నారు. వింజమూరు లో డయాలసిస్ కేంద్ర ఏర్పాటు, సుమారు 6 కోట్ల రూపాయలతో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందన్నారు. సీతారామపురం, ఉదయగిరి మండలాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేలా కార్పొరేటర్ వైద్యం అందేలా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో సీతారామపురం మండల మాజీ జెడ్పిటిసి కలివెల జ్యోతికి మెంబర్ గా చోటు కల్పించి ఆమె సూచనలతో సీతారామపురం ప్రాంత ప్రజల కు వైద్య సదుపాయాలు సకాలంలో అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తెలుగుదేశంలో యువకులకు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని అందులో భాగంగానే సీతారామపురం మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజా, యువబినాయకులు చింతల శ్రీను లను టిడిపి ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని, సీతారామపురం అభివృద్ధిలో వారి పాత్ర కీలకమన్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజకీయంగా ఆర్థికంగా పూర్తిగా వెనక్కి నెట్టేసిందని, కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి పొందుతూ ముందుకు వెళుతుందన్నారు. వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లలో నియోజకవర్గంలోని 143 పంచాయతీలలో కనీసం పంచాయతీల నిధులు లేని పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలకు నిధులు కేటాయించి పంచాయతీల అభివృద్ధికి తోడ్పడిందన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నిటిని అమలు చేసి ప్రజల ఆదరణాభిమానాలు పొందిందన్నారు. కేవలం టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందినదని,మిగిలిన వారు ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తూ కాలాన్ని గడిపేసారన్నారు. రాష్ట్రంలో వైసిపి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాబోయే స్థానిక ఎన్నికలలో మరోసారి వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పి నియోజకవర్గంలోని 143 పంచాయతీలను, ఎంపీటీసీలు, జడ్పిటిసి లను గెలుచుకుంటామనే నమ్మకం ఉందని ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ సభ, కార్యక్రమం నిర్వహించినా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.