*తెలంగాణ కాంగ్రెస్‌లో రాజ్యసభ టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటీ బాగా పెరిగింది. నామినేషన్లకు ఆఖరి గడువు (మార్చి5) ముంచుకొస్తున్నా అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఇంకా కసరత్తు చేస్తోంది…!!!!*
నిన్న రాహుల్ గాంధీ పర్యటనలో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వస్తుందని భావించినా అలా జరగలేదు. *నిన్న ఎయిర్ పోర్టులో రాహుల్‌తో జరిగిన భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ రాలేదని పీసీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.* మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై స్పందించారు. ఈ విషయంలో మరోసారి చర్చిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. రేసులో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాతే రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు.
*రేపు అభ్యర్థుల ప్రకటన…!*
రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల విషయంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు రేపు (బుధవారం) రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి వెళ్లపోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున అభ్యర్థులను ఖరారు చేద్దామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


