*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
తుఫాన్ నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం లో వివిధ వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు పలు వార్డుల్లో కూటమి శ్రేణులతో పర్యటించిన ఎమ్మెల్యే*
*పునరావాస కేంద్రాలను మరియు క్షేత్రస్థాయిలో జరిగే ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే*
*తీర ప్రాంతం తో పాటు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో స్వయంగా పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే*
*30, 31 ,35 ,36, 37 ,38, 39 వార్డుల్లో స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే*
*ప్రజల రక్షణే ప్రథమ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు కూటమి శ్రేణులకు పిలుపు*
*అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఎమ్మెల్యే*
*జోరు వానలో నియోజకవర్గ పర్యటనపై ఎమ్మెల్యే పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్న ప్రజలు*
ఈరోజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గం నియోజవర్గ స్థాయిలో ఉన్న పలు వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డులు పర్యటనలో భాగంగా కూటమి శ్రేణులతో , స్థానిక ప్రజలను కలిసి తుఫాను ప్రభావం పై ఆరా తీశారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను మరియు నిరాశ్రయులకు కల్పించే ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలుచోట్ల నీరు నిల్వ ఉండడాన్ని గమనించి, సంబంధిత అధికారులను పిలిపించి, క్లియర్ అయ్యేవిధంగా స్వయంగా పర్యవేక్షించారు. జోనల్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు మరియు ఎమ్మార్వో శ్రీ పాత్రుడు గారు మరి ఇతర అధికారులతో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలియజేశారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నట్లయితే తీసుకోవాల్సిన చర్యలు పై కూడా అధికారులకు వివరించారు. 35వ వార్డు స్టేడియం దగ్గర్లో నీరు నిల్వ ఉండడాన్ని గమనించి వెంటనే క్లియర్ అయ్యేవిధంగా చూడాలని అధికారులకు తెలిపారు. 36వ వార్డులో ఎవెన్ కాలేజ్ కాలేజీ వద్ద గోడ కూలిన నేపథ్యంలో ఆటో పూర్తిగా ధ్వంసమై కుటుంబంతో మాట్లాడి, సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. నావెల్ క్యాంటీన్ వద్ద స్థానిక మత్స్యకారులు కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి సహకారం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని వివరించారు. 39 వ వార్డు 31 వ వార్డు మరి ఇతర వార్డుల్లో ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్ తో పాటు వివిధ హోదాలలో ఉన్న టిడిపి, జనసేన ,బిజెపి శ్రేణులు స్థానిక వార్డు సిబ్బంది , జీవీఎంసీ సిబ్బంది ,సచివాలయం సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బందితో పాటు విభాగాల అధికారులు పాల్గొన్నారు..


