శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం నాడు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రాంతంలో విద్యా రంగ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల మెరుగుదల వంటి విషయాలను మంత్రికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం విద్యా మరియు పారిశ్రామిక రంగాల్లో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా లోకేష్ చూపుతున్న దూరదృష్టి, నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి నారా లోకేష్‌ను కలుసుకుని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

తిరుపతి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వాగతం