టీడీపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి
పున్నమి ప్రతినిధి, తిరుపతి
గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ కో ఆర్డినేటర్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో “తిరుపతి జిల్లా అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై సమీక్షా సమావేశం” నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మరియు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి *”తుడా చైర్మన్, టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి”* పాల్గొన్నారు.ఈ సమావేశంలో తిరుపతి జిల్లాలో అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన పార్టీ కమిటీతో పాటు అనుబంధ విభాగాలు కూడా ఎంతో కీలకమని, తెలుగు మహిళ, తెలుగు యువత, బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్, వాణిజ్య విభాగం. ఇలా మరిన్ని అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసి, పార్టీకి ఎప్పటినుండో కస్టపడి పనిచేసిన వారికి ఈ కమిటీల్లో సముచిత స్థానం కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తుందని, దీనిద్వారా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని తెలియజేశారు.


