ఎర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: ఎర్పేడు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 265 కిలోల రాగి (కాపర్) వైర్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్పేడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో, సబ్ఇన్స్పెక్టర్ రవి ప్రకాష్ నాయకత్వంలో పోలీసు బృందం బుధవారం ఏర్పేడు మండలంలోని వికృతమాల గ్రామ పరిధిలోని నీల్లద్రి అపార్ట్మెంట్ సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అరెస్టయిన నిందితుడు తుమ్మమరు యుగాంధర్ వయస్సు (25) సం మునగలపాలెం అరుంధతి వాడకు చెందినవాడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి మొత్తం 265 కిలోల రాగి వైర్ స్వాధీనం చేసుకున్నారు. యుగాంధర్పై ఇప్పటికే మొత్తం 9 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరశురామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బయటపడిన వివరాల ప్రకారం, యుగాంధర్, పరశురామ్ కలిసి ఏర్పేడు మండలంతో పాటు పరిసర గ్రామాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి అందులోని కాపర్ వైర్‌ను దొంగిలించి విక్రయించేవారని తెలిసింది. ఆ డబ్బుతో తమ చెడు అలవాట్లు, వ్యసనాలను తీర్చుకునేవారని పోలీసులు తెలిపారు. ఈ దొంగతనాల వల్ల ఏర్పేడు మండలంలోని సుమారు 40 గ్రామాలకు చెందిన 42 మంది రైతుల పొలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దాంతో రైతులు వేసిన పంటలకు సకాలంలో నీరు అందక తీవ్ర నష్టాన్ని చవిచూసినట్లు వెల్లడైంది. ఈ ఘటనల నేపథ్యంలో వైర్ దొంగతనాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ సుబ్బబరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో, రేణిగుంట ఎస్డీపీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ బృందం పనిచేస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ రవి ప్రకాష్‌తో పాటు పోలీస్ కానిస్టేబుళ్లు మునిరెడ్డి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అరెస్టయిన నిందితుడిని పోలీసులు విచారిస్తూ, పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనాలపై పోలీసుల దాడి–265 కిలోల రాగి వైర్ స్వాధీనం, ఒకరు అరెస్ట్