రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గౌ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, మర్రిపాడు మండల కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు దేవరాల గంగాధర్ యాదవ్ మరియు ఆత్మకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో జరిపారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, టీడీపీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేతలు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన టీడీపీ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గౌ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, మర్రిపాడు మండల కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు దేవరాల గంగాధర్ యాదవ్ మరియు ఆత్మకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో జరిపారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, టీడీపీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతలు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన టీడీపీ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

