Friday, 20 February 2026
  • Home  
  • జైలు నుంచి విడుదలైన పగడాల నాగరాజును పరామర్శించిన కేటీఆర్
- ఖమ్మం

జైలు నుంచి విడుదలైన పగడాల నాగరాజును పరామర్శించిన కేటీఆర్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఖమ్మం నగర బి ఆర్ ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజును భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చరవాణి ద్వారా పరామర్శించారు. సుమారు 22 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైలులో ఉండి శుక్రవారం విడుదలైన నాగరాజు ఆరోగ్య పరిస్థితి, తాజా పరిస్థితులపై కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల హడావుడి కారణంగా వ్యక్తిగతంగా రావలేకపోయానని, త్వరలోనే ఖమ్మం వచ్చి కలుస్తానని నాగరాజుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. నాగరాజు ధైర్యంగా ఉండాలని, పార్టీ కార్యకలాపాల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో ఖమ్మం బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)

ఖమ్మం నగర బి ఆర్ ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజును భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చరవాణి ద్వారా పరామర్శించారు.

సుమారు 22 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైలులో ఉండి శుక్రవారం విడుదలైన నాగరాజు ఆరోగ్య పరిస్థితి, తాజా పరిస్థితులపై కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల హడావుడి కారణంగా వ్యక్తిగతంగా రావలేకపోయానని, త్వరలోనే ఖమ్మం వచ్చి కలుస్తానని నాగరాజుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

నాగరాజు ధైర్యంగా ఉండాలని, పార్టీ కార్యకలాపాల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పరిణామంతో ఖమ్మం బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.