Thursday, 12 February 2026
  • Home  
  • జైన్ దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు
- పశ్చిమ గోదావరి

జైన్ దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : కార్తిక పౌర్ణమి సందర్భంగా జైన్ లు ఎంతో పవిత్రంగా చేసుకునే పండుగ పూర్ణిమ మేళా మహోత్సవమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పెద అమిరంలోని జైన్ దేవాలయంలో బుధవారం జరిగిన కార్తీక పూర్ణిమ మేళా మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే కార్తీక పూర్ణిమ మేళా మహోత్సవాన్ని ఇంతా వైభవంగా సంప్రదాయ బద్దంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముందుగా స్వామివారికి అభిషేకాలు, హారతులు అందించారు. దేవాలయ ప్రాంగణంలో కీర్తనలను ఆలపించారు. కార్యక్రమంలో మెహందర్ కుమార్ జైన్, ప్రకాష్ కుమార్ జైన్, నరేష్ కుమార్ జైన్, రమేష్ కుమార్ జైన్, ప్రమోద్ కుమార్ జైన్, వినోద్ కుమార్ జైన్, వబిలిశెట్టి రామకృష్ణ, యర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.