శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పూసల వీధిలో టీడీపీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. “బాబు వస్తేనే జాబు వస్తుంది” అనే నమ్మకాన్ని నిజం చేస్తూ సరైన సమయంలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడం యువతకు ఊపిరి పోసిందని కొనియాడారు. ఎన్నికల హామీల మేరకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందని, యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచడమే లక్ష్యమని, ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు కల్పించామని, పరిశ్రమల స్థాపనతో మరింత ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. ఉగాది సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వివిధ శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని, అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండలం, తెలుగు యువత అధ్యక్షుడు బీమాల చంద్రబాబు చందు, శ్రీకాళహస్తి పురపాలక సంఘం, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, తిరుపతి పార్లమెంటు నాయకులు ఆనంద్ రెడ్డి, సయ్యద్ ముజీబ్, గాజుల భగత్, సులేమాన్, గంగనపల్లి రమేష్, సయ్యద్ ఆదిల్, వెంకటస్వామి, కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం, మారయ్య, సలార్ తదితరులు పాల్గొన్నారు.

జాబ్ క్యాలెండర్‌తో యువతకు ఊపిరి…బాబు వచ్చారు–జాబులు తెచ్చారు అంటూ టీడీపీ నేతల హర్షం