జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్దించండి. *** మీడియా అక్రెడిటేషన్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి —ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ పొదలకూరు అక్టోబర్ 9:: గత ప్రభుత్వాల హయాంలో ఉన్న జర్నలిస్టు సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీ రామ్ యాదవ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన్నెపల్లి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ రామ్ మాట్లాడుతూ నెల్లూరు పున్నమి పత్రిక ఎడిటర్ కోటేశ్వరరావు సతీమణి అకాల మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారిని పరామర్శించడం జరిగినదని పేర్కొన్నారు.అలాగే ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం అనేక జీ.ఓ.లను విడుదల చేసే ప్రభుత్వాలు మీడియా అక్రిడిటేషన్ జీ.ఓ. ఇచ్చి, నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల వర్కింగ్ జర్నలిస్టులు అభద్రతా భావానికి గురి అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రాని మీడియా జర్నలిస్టులు అందరికీ సులభతరంగా అక్రిడేషన్ మంజురు అయ్యే విధంగా జూలై లో ఇచ్చిన జీవో ప్రకారం తక్షణమే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న జర్నలిస్టు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ,, సంక్షేమ నిధి తక్షణమే పునరుద్ధదించాలని, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పరిమితి రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని శ్రీ రామ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక ఇంటి నిర్మాణానికి తగు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు పెన్షన్స్ సౌకర్యం అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వర్కింగ్ మీడియా ప్రతినిధులకు 15,000 పెన్షన్ సౌకర్యాన్ని కలిగించాలని ఆయన కోరారు. జర్నలిస్టుల మీద, పత్రిక కార్యాలయాల మీద దాడులు జరుగుతున్న నేపధ్యంలో తక్షణమే మీడియా దాడుల నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఎం.పీ.ఎ నెల్లూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు కామంచి హాజరత్ ప్రధాన కార్యదర్శి మేకల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు కల్లూరు సుధాకర్ రెడ్డి మరియు ఏ.పీ.ఎం.పీ.ఎ కుటుంబ సభ్యులు పొదలకూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొనడం జరిగినది.

జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్దించండి.