సమాజం మనుగడకు సంస్కృతి మూలం:
ప్రముఖ కవి డాక్టర్ పసునూరి రవీందర్ పిలుపు
——————————————–
జనగామ, అక్టోబర్ 11,పున్నమి న్యూస్:
సమాజం మనుగడకు సంస్కృతి మూలాధారమని ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు. శనివారం జనగామలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జనగామ రచయితల సంఘం 15 ఏళ్ల ఆవిర్భావ సభ జనగామ జిల్లా పదేళ్ల ఆవిర్భావ ఉత్సవం జరసం అధ్యక్షులు నక్క సురేష్ ఆధ్వర్యంలో తొలుత జనగామ కవులు రచించిన వంద కవితల” సాగుబాటు” కవిత్వ సంకలనం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ కవులు రచయితలు తమ సామాజిక అనుభవాలను సాహిత్యంలో లిఖితవ్యం చేయాలని కోరారు. సాంస్కృతిక ఉద్యమం తోనే సామాజిక రాజకీయ ఉద్యమాలు మరింత బలపడతాయని ఆయన చెప్పారు. కవులు సమాజ అవసరాలను గుర్తుంచుకొని రచనలు చేయాలని కోరారు. తాటికొండ రాజయ్య మాజీ తొలి ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ జనగామ జిల్లా ఉద్యమంలో జనగామ యువత పోషించినటువంటి పాత్ర కీలకమైందని ఆయన అభినందించారు. జిల్లాను సాధించడంతోనే అభివృద్ధి కాదని రాష్ట్రంలో జనగామ జిల్లా అగ్రభాగంలో ఉండటానికి యువత పోరాటాలను ప్రణాళిక బద్ధంగా చేయాలని కోరారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించడానికి పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రణాళికలో జనగామకు పెద్దపీటవేసేలాగా ప్రభుత్వం దృష్టికి ఉద్యమాలు వెళ్లాలని కోరారు. ప్రముఖ కవి కటుకోజుల ఆనందాచారి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని పరిమళ భరితం చేయడానికి జనగామ రచయితల సంఘం చేస్తున్నటువంటి కృషిని అభినందించారు.సమాజంలో మీ అట్టడుగు వర్గాల జీవితాల్ని కష్టసుఖాల్ని సాహిత్యంలో ప్రతిఫలింప చేయడానికి యువ రచయితలు దృష్టి కేంద్రీకరించాలని కోరారు.సాహిత్య సృజన అధ్యయనం సమాజంలో విలువల పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు యువత అభ్యుదయ ప్రగతిశీల ప్రజాస్వామిక సాహిత్యాన్ని తమ జీవితంలో భాగంగా అధ్యయనం చేయాలని కోరారు. జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్ మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో సాహిత్య సృజన సామాజిక సంబంధాల అభివృద్ధి సాంస్కృతిక పరిరక్షణ కోసం జరసం కృషి చేస్తుందని అన్నారు.
‘ సాగుబాటు’ కవిత్వాన్ని డాక్టర్ పోరెడ్డి రంగయ్య సమీక్షించి ఆహుతులను ఆనందింపజేశారు. జనగామ జిల్లా జేఏసీ నాయకులు మంగళంపల్లి రాజు, డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, జరసం ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, జోగు అంజయ్య, భాస్కర్ సోమేశ్వర్, కృష్ణ, వెంకటేశం,రేణుకుంట్ల మురళి, సాంబరాజు యాదగిరి లింగంపల్లి రామచంద్రం, సోమ నరసింహ చారి, డాక్టర్ సదానందం, పుట్టవర్తిని భాస్కర్, మోహన్ కృష్ణ,
తదితరులు పాల్గొన్నారు. అనంతరం జనగామ రచయితల సంఘం కవులు రచయితలు కళాకారులను ఘనంగా మెమెంటోలు శాలువాలతో సన్మానించారు.

‘జరసం’ 15 ఏళ్లు & జనగామ జిల్లా పదేళ్ళ ఆవిర్భావ ఉత్సవం
సమాజం మనుగడకు సంస్కృతి మూలం: ప్రముఖ కవి డాక్టర్ పసునూరి రవీందర్ పిలుపు ——————————————– జనగామ, అక్టోబర్ 11,పున్నమి న్యూస్: సమాజం మనుగడకు సంస్కృతి మూలాధారమని ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు. శనివారం జనగామలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జనగామ రచయితల సంఘం 15 ఏళ్ల ఆవిర్భావ సభ జనగామ జిల్లా పదేళ్ల ఆవిర్భావ ఉత్సవం జరసం అధ్యక్షులు నక్క సురేష్ ఆధ్వర్యంలో తొలుత జనగామ కవులు రచించిన వంద కవితల” సాగుబాటు” కవిత్వ సంకలనం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ కవులు రచయితలు తమ సామాజిక అనుభవాలను సాహిత్యంలో లిఖితవ్యం చేయాలని కోరారు. సాంస్కృతిక ఉద్యమం తోనే సామాజిక రాజకీయ ఉద్యమాలు మరింత బలపడతాయని ఆయన చెప్పారు. కవులు సమాజ అవసరాలను గుర్తుంచుకొని రచనలు చేయాలని కోరారు. తాటికొండ రాజయ్య మాజీ తొలి ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ జనగామ జిల్లా ఉద్యమంలో జనగామ యువత పోషించినటువంటి పాత్ర కీలకమైందని ఆయన అభినందించారు. జిల్లాను సాధించడంతోనే అభివృద్ధి కాదని రాష్ట్రంలో జనగామ జిల్లా అగ్రభాగంలో ఉండటానికి యువత పోరాటాలను ప్రణాళిక బద్ధంగా చేయాలని కోరారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించడానికి పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రణాళికలో జనగామకు పెద్దపీటవేసేలాగా ప్రభుత్వం దృష్టికి ఉద్యమాలు వెళ్లాలని కోరారు. ప్రముఖ కవి కటుకోజుల ఆనందాచారి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని పరిమళ భరితం చేయడానికి జనగామ రచయితల సంఘం చేస్తున్నటువంటి కృషిని అభినందించారు.సమాజంలో మీ అట్టడుగు వర్గాల జీవితాల్ని కష్టసుఖాల్ని సాహిత్యంలో ప్రతిఫలింప చేయడానికి యువ రచయితలు దృష్టి కేంద్రీకరించాలని కోరారు.సాహిత్య సృజన అధ్యయనం సమాజంలో విలువల పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు యువత అభ్యుదయ ప్రగతిశీల ప్రజాస్వామిక సాహిత్యాన్ని తమ జీవితంలో భాగంగా అధ్యయనం చేయాలని కోరారు. జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్ మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో సాహిత్య సృజన సామాజిక సంబంధాల అభివృద్ధి సాంస్కృతిక పరిరక్షణ కోసం జరసం కృషి చేస్తుందని అన్నారు. ‘ సాగుబాటు’ కవిత్వాన్ని డాక్టర్ పోరెడ్డి రంగయ్య సమీక్షించి ఆహుతులను ఆనందింపజేశారు. జనగామ జిల్లా జేఏసీ నాయకులు మంగళంపల్లి రాజు, డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, జరసం ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, జోగు అంజయ్య, భాస్కర్ సోమేశ్వర్, కృష్ణ, వెంకటేశం,రేణుకుంట్ల మురళి, సాంబరాజు యాదగిరి లింగంపల్లి రామచంద్రం, సోమ నరసింహ చారి, డాక్టర్ సదానందం, పుట్టవర్తిని భాస్కర్, మోహన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జనగామ రచయితల సంఘం కవులు రచయితలు కళాకారులను ఘనంగా మెమెంటోలు శాలువాలతో సన్మానించారు.

