

జన్మదినాన అన్నదానం మంచి ఆలోచనని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి.సింధూర అన్నారు. నరసన్నపేట మండలం, పిన్నింటిపేటకు చెందిన గుంతు.వనిత జన్మదినం సందర్భంగా, నగరంలో నిస్సహాయులకు అన్నవితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో భాగముగా పేదలకు ఆహారాన్నందించి డా. పైడి.సింధూర మాట్లాడుతూ జన్మదినం రోజున పది మంది ఆకలి తీర్చటం హర్షణీయమని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చెయ్యటం ఆనందంగా ఉందన్నారు.
వేడుకలను నిరుపేదల మధ్య జరుపుకోవాలనే ఆలోచన గొప్పదని, ఈ కార్యక్రమానికి పరోక్షముగా సహాయమందించిన పొడుగు.చరణ్ కు, నేటి దాతలు గుంతు.లక్ష్మణ్, గుంతు.వనిత దంపతులకు అభినందనలు తెలిపారు.
అనంతరం నగరంలో పలు ముఖ్య కూడలిలో అభాగ్యులకు లయన్స్ క్లబ్ మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్ ఆహారాన్నందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ, ఫ్రొఫెసర్ డా.విష్ణు మూర్తి, నైట్ షెల్టర్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

