Saturday, 14 March 2026
  • Home  
  • జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా రక్తదాన శిబిరం..!
- అనకాపల్లి

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా రక్తదాన శిబిరం..!

అనకాపల్లి జిల్లా మార్చి 14 పున్నమి న్యూస్ : ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. గౌరవ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి ఝాన్సీ, బొద్దపు శ్రీనివాస్ రావు, కొఠారి నరేష్, ఉటకోటి రమేష్, కొఠారి శ్రీను మాస్టర్, గుర్రాల శేఖర్, గొర్లె సత్తిబాబు, కొలగాని భాస్కర్, గంధం శివ తదితర నాయకులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం గొప్ప సేవ అని, అవసరమైన వారికి ప్రాణాలు కాపాడే మహోన్నత కార్యక్రమమని నాయకులు తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్పందించారు. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనకాపల్లి జిల్లా మార్చి 14 పున్నమి న్యూస్ : ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. గౌరవ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో కర్రి ఝాన్సీ, బొద్దపు శ్రీనివాస్ రావు, కొఠారి నరేష్, ఉటకోటి రమేష్, కొఠారి శ్రీను మాస్టర్, గుర్రాల శేఖర్, గొర్లె సత్తిబాబు, కొలగాని భాస్కర్, గంధం శివ తదితర నాయకులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం గొప్ప సేవ అని, అవసరమైన వారికి ప్రాణాలు కాపాడే మహోన్నత కార్యక్రమమని నాయకులు తెలిపారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్పందించారు. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.