జగ్గయ్యపేట పట్టణంలోని 24వ వార్డులో బుధవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పర్యటించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ రంగాపురం రాఘవేంద్ర కూడా పాల్గొన్నారు. వార్డు పరిధిలోని నీటి సరఫరా, డ్రైనేజ్, వీధి లైటింగ్ మరియు పరిశుభ్రత అంశాలను వారు సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఈ వేసవిలో పట్టణంలోని ఏ ఇంటికీ నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. అవసరమైతే అదనపు నిధులు సమకూర్చి నీటి సరఫరా సమస్యలను పూర్తిగా పరిష్క రిస్తాము,” అని తెలిపారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఆయన, అవసరమైనప్రాంతాల్లో లైట్లు, డ్రైనేజ్ పనులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే ‘స్వచ్ఛ జగ్గయ్యపేట’ లక్ష్యాన్ని సాధించేందుకు సానిటేషన్ పనులనుబలోపేతం చేయాలని సూచించారు.
అవసరమైతే మున్సిపల్ మంత్రితో మాట్లాడి అదనపు పైప్‌లైన్ నిధులు సమకూర్చేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ నూకల కుమార్ రాజా, వార్డ్ కౌన్సిలర్ సదుపాటి రాజు, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, వార్డ్ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

జగ్గయ్యపేటలో 24వ వార్డును పర్యటించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ నీటి సమస్యలపై చర్యలు — లైటింగ్, డ్రైనేజ్ పనులకు ఆదేశాలు
జగ్గయ్యపేట పట్టణంలోని 24వ వార్డులో బుధవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పర్యటించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ రంగాపురం రాఘవేంద్ర కూడా పాల్గొన్నారు. వార్డు పరిధిలోని నీటి సరఫరా, డ్రైనేజ్, వీధి లైటింగ్ మరియు పరిశుభ్రత అంశాలను వారు సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఈ వేసవిలో పట్టణంలోని ఏ ఇంటికీ నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. అవసరమైతే అదనపు నిధులు సమకూర్చి నీటి సరఫరా సమస్యలను పూర్తిగా పరిష్క రిస్తాము,” అని తెలిపారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఆయన, అవసరమైనప్రాంతాల్లో లైట్లు, డ్రైనేజ్ పనులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే ‘స్వచ్ఛ జగ్గయ్యపేట’ లక్ష్యాన్ని సాధించేందుకు సానిటేషన్ పనులనుబలోపేతం చేయాలని సూచించారు. అవసరమైతే మున్సిపల్ మంత్రితో మాట్లాడి అదనపు పైప్‌లైన్ నిధులు సమకూర్చేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ నూకల కుమార్ రాజా, వార్డ్ కౌన్సిలర్ సదుపాటి రాజు, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, వార్డ్ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

