
జగనన్నా ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లను వీడియొ కాల్స్‌కు స్పందించమని సలహా చెప్పండి
ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో డాక్టర్ల ఓపీలన్నీ బందయ్యాయి. దాదాపు అన్నీ ప్రయివేటు ఆసుపత్రులు మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికే తొమ్మిది నెలల గర్భిణులు డెలివరి సమయం వచ్చినవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు భయాందోళనలో ఉన్నారు. దాదాపు మత్తు డాక్టర్లందరినీ ప్రభుత్వం హాండ్ ఓవర్ చేసుకోవడం సిజేరియన్లు చేయాలంటే ఓ ప్రక్క కరోనా కారణంతో లాక్ డౌన్ స్టాప్ రాలేకపోవడం ఇబ్బందులూ వినిపిస్తున్నాయి. చాలామంది రెగ్యులర్ పేషెంట్లకు డాక్టర్ల సలహా పొందే అవకాశం తక్కువైంది. కొందరి డాక్టర్ల ఫోనులు స్పందించడం కష్టంగా ఉంది అంటున్నారు. ఎమర్జన్సీ డెలివరీ లు సిజేరియన్లు కు ఆయా డాక్టర్లూ సరైన ఏర్పాట్లు చేసుకొని ఉండేలా చర్యలు తీసుకుంటూనే…చాలామంది కి డాక్టరు తో మాట్లాడితే అదో ఉపశమనం. ఈ రోజుల్లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పేషెంట్లకు రోజూలో ఏదో కొంత సమయం కేటాయించి వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉంటే చాలమంచిది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారూ తమసభ్యులకు ఇలా ఆదేశాలిస్తే మేలు అని ఈ విషయం ను నెల్లూరు వాసి నాగరాజరావు లాయరు సీఎం మరియు జిల్లా యంత్రాంగంకు ట్వీట్ చేయడం జరిగింది. డాక్టర్లు ఈ వీడియో కాల్ కన్సల్టేషన్ ఏర్పాటుకు సన్నధ్ధం అవడం ఎంతో లాభదాయకం.