చీటింగ్ కేసులో సదరం శివ( రిటైర్డ్ రైల్వే TTE) సదరం ప్రేమ్ సాగర్ తండ్రి కొడుకులు అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * డబ్బులు ఆశ చూపి మాయమాటలతో మభ్యపెట్టి కే రమ్య రాజు అనే మహిళను ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఒక కోటి 97 లక్షలు నమ్మించి పెట్టుబడి పెట్టించారు. అవి వెనక్కి రాకపోగా ఆమె ఆ డబ్బులు కోసం సదరం ప్రేమ్ సాగర్ ని అడగగా ఇంకొంత డబ్బులు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు వెనక్కి వస్తాయని ఆమెను నమ్మించారు. ఆమె నా దగ్గర ఇంకా డబ్బులు లేవని చెప్పగా ఇంట్లో బంగారం ఉంటే తీసుకురమ్మని చెప్పగా ఆమె వారి మాటలు నమ్మి 75 తులాల బంగారం వారిద్దరూ ఆనంద్ అనే వ్యక్తి ద్వారా తాకట్టు పెట్టి మరల ఆ డబ్బుల్ని కాజేశారు. ఆమె పలుమార్లు డబ్బులు కోసం అడగగా ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేసేవారు. విషయం తెలుసుకున్న ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ ను రిమాండ్ కి తరలించారు.


