ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో 132 ఫిర్యాదులు స్వీకరణ.
• ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదు.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆదేశాలు.
• ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్టపరిధిలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా యస్.పి. గారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
1. ఇందుకూరుపేట పరిధికి చెందినటువంటి వ్యక్తిని మరియు అతని స్నేహితుడిని, అనంతపురంకు చెందిన రాజు అనే వ్యక్తి, వాట్సప్ ద్వారా పరిచయమై సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి, ఒక్కొక్కరు వద్ద లక్ష యాభై వేల రూపాయలు తీసుకొని, జాబు ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
2. నెల్లూరు రూరల్ పరిధికి చెందిన వ్యక్తిని, సంతపేటకి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి చీటీలు వేయించుకొని, నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, మోసపోయామని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
3. బిట్రగుంట పరిధికి చెందినటువంటి మహిళను, తన భర్త అత్తమామలు వేధిస్తున్నారని, భర్త చెడు వ్యసనాలకు బానిసై మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
4. కోట పరిధికి చెందిన వృద్ధురాలిని, తన పెద్ద కుమారుడు భార్య, మనవడు బెదిరిస్తూ, తన అనుమతి లేకుండా తనకు జీవనాధారం కోసం ఉంచుకున్నటువంటి పొలంలో నారు వేశారని, అడిగితే దాడి చేశారని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
5. కలిగిరికి చెందినటువంటి మహిళ యొక్క కుమార్తె, 03.02.26 నుండి కనిపించడం లేదని, ఆచూకీ కనుగొని అప్పగించాలని కోరారు.
6. చిన్న బజారుకు పరిధికి చెందిన వ్యక్తిని, తన స్నేహితుడు ముజ్మల్ తనని కొట్టి గాయపరిచినట్లు, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు, ప్రస్తుతం కోర్టులో కేసు విచారణలో ఉన్నదని, ముజ్మల్ తన మనుషులతో బెదిరిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్ గారు హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, DCRB CI శ్రీ రామారావు, మహిళా స్టేషన్ CI శ్రీ సుబ్బారావు, SB-1 CI శ్రీ వెంకటేశ్వర రావు, SB-2 CI శ్రీనివాస రెడ్డి గార్లు మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.



