Wednesday, 30 July 2025
  • Home  
  • చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో టిడిపి మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్ధన్ నాయుడు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయసమావేశం
- Featured - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో టిడిపి మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్ధన్ నాయుడు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయసమావేశం

*మర్రిపాడు లో టిడిపి ఆత్మీయ సమావేశంలో* *పాల్గొన్న అతిరధ మహారథులతో* *మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదేర్యంలో* *ఆనం రామనారాయణ రెడ్డి భేటీ* *మర్రిపాడు: ఏప్రిల్ (పున్నమి ప్రతినిది* మండల కేంద్రంలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో టిడిపి మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్ధన్ నాయుడు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయసమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నేను వైఫల్యం చెందారన్నారు. రూ 2.70 వేల కోట్ల రూపాయలు నేరుగా అందరి ఖాతాలకు వేస్తున్నామని ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు 89 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగా వైసిపి ప్రభుత్వం వాటిని 69 లక్షలకు కుదించారని ఈరేషన్ కార్డులు తొలగించడానికి గల కారణాలను వైసిపి ప్రభుత్వం చెప్పాలన్నారు. టిడిపి హయాంలో రేషన్ కార్డు కలిగిన వారికి బియ్యంతో పాటు 8 రకాల సరుకులు అందజేశారని, వైసిపి ప్రభుత్వం బియ్యానికి పరిమితం చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం 5.65 వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఉచితంగా ఇస్తే జగన్ ముద్రించిన కార్డులకు ఇస్తున్నారన్నారు. రైతు భరోసా కింద రైతులకురూ 13500లు ఇస్తామని చెప్పిరూ7500లు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ కింద ఇచ్చే రూ 6000 లు కలుపుకుని మొత్తం నేనే ఇస్తున్నానని అనడం సిగ్గుచేటన్నారు. ఇలా పేదలను రైతులను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక 70 పథకాలు రద్దయ్యాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమానికి 19 శాతం నిధులు ఖర్చు చేయగా, వైసిపి ప్రభుత్వం 15శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 16 లక్షల మంది పేద విద్యార్థులకు అందించామని, జగన్ ప్రభుత్వం 9 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చిందన్నారు. మద్యం తయారు చేసే కంపెనీలకు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి యజమానులుగా ఉండి విషపూరితమైన మద్యము తయారుచేసి కోట్లాదిమంది పేదల బ్రతుకులతోఆటలాడుకుంటున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారంలో లక్షల కోట్లు దోసుకుంటున్నారన్నారు. బాబాయిని చంపిన వారిని వెంటపెట్టుకొని తిరుగుతున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఒకసారి తండ్రిని మరొకసారి బాబాయ్ గుండెపోటు గొడ్డలిపోటని జగన్ చిత్రీకరించాడని ఎద్దేవా చేశారు. దోపిడి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని సొంత చెల్లెలు ప్రజలకు నిజాలు తెలియజేసేందుకు బయలుదేరారన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసి మండల ప్రజలకుసాగు త్రాగునీరుఅందిస్తామన్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు, ఐదేళ్లలో యువతకు 20 లక్షల మందికి ప్రైవేటు ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15వేలు, ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే రూ 30000, ముగ్గురు ఉంటేరూ 45వేలు ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ 20వేలు అందజేస్తామని, ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకురూ 15 వేలు చొప్పున 54 సంవత్సరాల వరకు ఇస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిదుల తో బీసీలను ఆదుకుంటామని , బలహీన వర్గాలవారికి 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. త్వరలో జరగబోయే మహాసంగ్రామం లో మొదటి ఓటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతకుమారి, వైసిపి నాయకులు రవీంద్రారెడ్డి గిరినాయుడు శాఖమూరి నారాయణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*మర్రిపాడు లో టిడిపి ఆత్మీయ సమావేశంలో*

*పాల్గొన్న అతిరధ మహారథులతో*

*మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదేర్యంలో*
*ఆనం రామనారాయణ రెడ్డి భేటీ*

*మర్రిపాడు: ఏప్రిల్ (పున్నమి ప్రతినిది*

  1. మండల కేంద్రంలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో టిడిపి మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్ధన్ నాయుడు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయసమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నేను వైఫల్యం చెందారన్నారు. రూ 2.70 వేల కోట్ల రూపాయలు నేరుగా అందరి ఖాతాలకు వేస్తున్నామని ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు 89 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగా వైసిపి ప్రభుత్వం వాటిని 69 లక్షలకు కుదించారని ఈరేషన్ కార్డులు తొలగించడానికి గల కారణాలను వైసిపి ప్రభుత్వం చెప్పాలన్నారు. టిడిపి హయాంలో రేషన్ కార్డు కలిగిన వారికి బియ్యంతో పాటు 8 రకాల సరుకులు అందజేశారని, వైసిపి ప్రభుత్వం బియ్యానికి పరిమితం చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం 5.65 వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఉచితంగా ఇస్తే జగన్ ముద్రించిన కార్డులకు ఇస్తున్నారన్నారు. రైతు భరోసా కింద రైతులకురూ 13500లు ఇస్తామని చెప్పిరూ7500లు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ కింద ఇచ్చే రూ 6000 లు కలుపుకుని మొత్తం నేనే ఇస్తున్నానని అనడం సిగ్గుచేటన్నారు. ఇలా పేదలను రైతులను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక 70 పథకాలు రద్దయ్యాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమానికి 19 శాతం నిధులు ఖర్చు చేయగా, వైసిపి ప్రభుత్వం 15శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 16 లక్షల మంది పేద విద్యార్థులకు అందించామని, జగన్ ప్రభుత్వం 9 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చిందన్నారు. మద్యం తయారు చేసే కంపెనీలకు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి యజమానులుగా ఉండి విషపూరితమైన మద్యము తయారుచేసి కోట్లాదిమంది పేదల బ్రతుకులతోఆటలాడుకుంటున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారంలో లక్షల కోట్లు దోసుకుంటున్నారన్నారు. బాబాయిని చంపిన వారిని వెంటపెట్టుకొని తిరుగుతున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఒకసారి తండ్రిని మరొకసారి బాబాయ్ గుండెపోటు గొడ్డలిపోటని జగన్ చిత్రీకరించాడని ఎద్దేవా చేశారు. దోపిడి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని సొంత చెల్లెలు ప్రజలకు నిజాలు తెలియజేసేందుకు బయలుదేరారన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసి మండల ప్రజలకుసాగు త్రాగునీరుఅందిస్తామన్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు, ఐదేళ్లలో యువతకు 20 లక్షల మందికి ప్రైవేటు ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15వేలు, ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే రూ 30000, ముగ్గురు ఉంటేరూ 45వేలు ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ 20వేలు అందజేస్తామని, ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకురూ 15 వేలు చొప్పున 54 సంవత్సరాల వరకు ఇస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిదుల తో బీసీలను ఆదుకుంటామని , బలహీన వర్గాలవారికి 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. త్వరలో జరగబోయే మహాసంగ్రామం లో మొదటి ఓటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతకుమారి, వైసిపి నాయకులు రవీంద్రారెడ్డి గిరినాయుడు శాఖమూరి నారాయణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.