Monday, 30 March 2026
  • Home  
  • ఘన వైకుంఠ ఏకాదశి వేడుకలు
- కామారెడ్డి

ఘన వైకుంఠ ఏకాదశి వేడుకలు

కామారెడ్డి, 30 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తారు. రామారెడ్డి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవలు పలు వీధుల గుండా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేశారు. రామారెడ్డి మండల బండరాలలోని స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆకర్షణ కేంద్రంగా మారింది. భక్తుల ఉత్సాహం తండోపతండాలుగా వచ్చిన భక్తులు అభిషేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తుల రద్దీతో కిటికిటలా డాయి. ప్రత్యేకంగా రామారెడ్డి మండల కేంద్రంలోని ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది.జిల్లా వ్యాప్తంగా పలు ఆలయల్లో వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30, 2025) పర్వదినం మార్మోగాయి.భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం పొందారు.పూజా విధానాలు భక్తులు దైవిక నిష్ఠతో ఉపవాసం, జాగరణం, విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఆలయాల్లో భక్తులకు మంచి నీరు, క్యూలైన్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పర్వం వైకుంఠ ప్రాప్తికి మార్గం అని భక్తులు భావిస్తున్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్రీ బండి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ శ్రీ హన్మొయ్యొల్ల నవీన్, వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, రంజిత్, రాజు, మాజీ సర్పంచ్, దండబో యిన సంజీవ్, మాజీ ఎంపీటీసీ నామాల యాదగి రి, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి, 30 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తారు. రామారెడ్డి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవలు పలు వీధుల గుండా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేశారు. రామారెడ్డి మండల బండరాలలోని స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆకర్షణ కేంద్రంగా మారింది. భక్తుల ఉత్సాహం తండోపతండాలుగా వచ్చిన భక్తులు అభిషేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తుల రద్దీతో కిటికిటలా డాయి. ప్రత్యేకంగా రామారెడ్డి మండల కేంద్రంలోని ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది.జిల్లా వ్యాప్తంగా పలు ఆలయల్లో వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30, 2025) పర్వదినం మార్మోగాయి.భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం పొందారు.పూజా విధానాలు భక్తులు దైవిక నిష్ఠతో ఉపవాసం, జాగరణం, విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఆలయాల్లో భక్తులకు మంచి నీరు, క్యూలైన్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పర్వం వైకుంఠ ప్రాప్తికి మార్గం అని భక్తులు భావిస్తున్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్రీ బండి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ శ్రీ హన్మొయ్యొల్ల నవీన్, వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, రంజిత్, రాజు, మాజీ సర్పంచ్, దండబో యిన సంజీవ్, మాజీ ఎంపీటీసీ నామాల యాదగి రి, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.