Wednesday, 30 July 2025
  • Home  
  • గ్రామ స్థాయిలో రైతులవద్దకే ప్రభుత్వ సేవలు..వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు
- Featured

గ్రామ స్థాయిలో రైతులవద్దకే ప్రభుత్వ సేవలు..వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు

30-5-2020మనుబోలు(పున్నమిప్రతినిధి )వ్యవసాయం సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ను మనుబోలు మండలంలో పలు గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కలసి ప్రారంభిచారు. రైతు భరోసా కేంద్రాలతో ప్రయోజనాలివే… రైతులకు అధిక ఆదాయం, ప్రజలకు ఆహార భద్రత ప్రధాన ఉద్దేశం. ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. వీరు రైతులకు తలలో నాలుకలా ఉండి వాళ్లకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి. భూసార పరీక్షల ఆధారంగా ఏయే పంటలు వేసుకోవచ్చో సలహా ఇస్తారు. నాణ్యమైన విత్తనాలు ఏవో గుర్తించి సూచిస్తారు. అనవసరంగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు మార్గాలు చెబుతారు. ఈ కేంద్రాలకు అనుబంధంగా ఉండే అగ్రి షాప్స్‌ నుంచి వ్యవసాయ పనిముట్లు, పంటల సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణోపాయాలు, మార్కెటింగ్‌ మెళకువలు నేర్పుతారు. ఇ–క్రాప్‌ బుకింగ్‌కు రైతుకు తోడ్పడతారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు, కౌలు రైతులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వ రాయితీలకు సిఫార్సు చేస్తారు. విత్తనం వేసింది మొదలు మార్కెటింగ్, గిరాకీ సరఫరా వరకు ఈ కేంద్రాలు రైతులకు తోడ్పడేలా సిద్దం చేసింది ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయి. రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి. ఆర్‌బీకేలో వ్యవసాయ సహాయకుడు ప్రతిరోజు పంటలను సమీక్షించి పంపే డేటాను మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షిస్తుంది. 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘కియోస్క్‌’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. మార్కెటింగ్‌ సేవలు రైతులకు అందుతాయి. ఇది దేశ చరిత్రలోనే తొలి ప్రయోగం.దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు. రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్‌ కియోస్క్‌ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకి, ఫోన్‌ నంబరును ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరలు కియోస్క్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూ అంతా ఓకే అనుకున్నాక క్లిక్‌ చే తయారవుతుంది. ‘హబ్‌’(గోదాము)కు తక్షణమే ఆ రైత చేయదలచిన సరుకుల ఆర్డర్‌ వెళుతుంద నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లో అందుతాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు.ఇ కేంద్రాల ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ను 155 251 ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కాల్ సెంటర్ ద్వారా రైతులకు కావలసిన సలహాలు సూచనలు అందజేస్తారు.మనుబోలుబిట్-1,మనుబోలుబిట్-2 వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం లో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,హరగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్,చేరెడ్డి రామిరెడ్డి, అన్నమాల ప్రభాకర్ రెడ్డి,దాసరి మహీంద్ర వర్మ,సుధాకర్ రెడ్డి,ఎంపీడీఓ వెంకటేశ్వర్లు,ఏ.ఓ జహీర్ వి.ఏ.ఏ లలిత సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

30-5-2020మనుబోలు(పున్నమిప్రతినిధి )వ్యవసాయం సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ను మనుబోలు మండలంలో పలు గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కలసి ప్రారంభిచారు.
రైతు భరోసా కేంద్రాలతో ప్రయోజనాలివే…
రైతులకు అధిక ఆదాయం, ప్రజలకు ఆహార భద్రత ప్రధాన ఉద్దేశం.
ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. వీరు రైతులకు తలలో నాలుకలా ఉండి వాళ్లకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి.
భూసార పరీక్షల ఆధారంగా ఏయే పంటలు వేసుకోవచ్చో సలహా ఇస్తారు. నాణ్యమైన విత్తనాలు ఏవో గుర్తించి సూచిస్తారు.
అనవసరంగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు మార్గాలు చెబుతారు.
ఈ కేంద్రాలకు అనుబంధంగా ఉండే అగ్రి షాప్స్‌ నుంచి వ్యవసాయ పనిముట్లు, పంటల సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణోపాయాలు, మార్కెటింగ్‌ మెళకువలు నేర్పుతారు.
ఇ–క్రాప్‌ బుకింగ్‌కు రైతుకు తోడ్పడతారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు, కౌలు రైతులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వ రాయితీలకు సిఫార్సు చేస్తారు.
విత్తనం వేసింది మొదలు మార్కెటింగ్, గిరాకీ సరఫరా వరకు ఈ కేంద్రాలు రైతులకు తోడ్పడేలా సిద్దం చేసింది ప్రభుత్వం
రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయి. రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి. ఆర్‌బీకేలో వ్యవసాయ సహాయకుడు ప్రతిరోజు పంటలను సమీక్షించి పంపే డేటాను మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షిస్తుంది.
10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘కియోస్క్‌’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. మార్కెటింగ్‌ సేవలు రైతులకు అందుతాయి. ఇది దేశ చరిత్రలోనే తొలి ప్రయోగం.దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు.
రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్‌ కియోస్క్‌ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకి, ఫోన్‌ నంబరును ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరలు కియోస్క్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూ అంతా ఓకే అనుకున్నాక క్లిక్‌ చే తయారవుతుంది. ‘హబ్‌’(గోదాము)కు తక్షణమే ఆ రైత చేయదలచిన సరుకుల ఆర్డర్‌ వెళుతుంద నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లో అందుతాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు.ఇ కేంద్రాల ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ను 155 251 ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కాల్ సెంటర్ ద్వారా రైతులకు కావలసిన సలహాలు సూచనలు అందజేస్తారు.మనుబోలుబిట్-1,మనుబోలుబిట్-2 వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం లో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,హరగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్,చేరెడ్డి రామిరెడ్డి, అన్నమాల ప్రభాకర్ రెడ్డి,దాసరి మహీంద్ర వర్మ,సుధాకర్ రెడ్డి,ఎంపీడీఓ వెంకటేశ్వర్లు,ఏ.ఓ జహీర్ వి.ఏ.ఏ లలిత సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.