– ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఘన సన్మానం!
కామారెడ్డి, 13 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన స్థానిక సర్పంచ్ సమావేశంలో గొల్లపల్లి గ్రామానికి రెండవ సర్పంచ్‌గా అటికల కిషన్ యాదవ్ గెలుపొందారు. ఈ అవకాశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆయన ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, గొల్లపల్లి ప్రజలు కిషన్ యాదవ్‌ను ఎన్నుకున్నం దుకు సంతోషం వ్యక్తం చేశారు.గ్రామాన్ని సర్వాంగ సుందరంగా మార్చాలి. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి సాధించి, దీన్ని మున్సిపాలిటీగా తీర్చిది ద్దాలి అని పిలుపునిచ్చారు.అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కిషన్ యాదవ్‌కు, వార్డు సభ్యుల కు సన్మానం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి మధు, వార్డు మెంబర్లు గొల్ల రాజ మణి, అటికెల లక్ష్మి, సీనియర్ నాయకులు జీర్ల మహేష్, ఎస్.రాజు, వి.రాజనార్సు, కెకె.బాలరాజ్, అటికెల శ్రీకాంత్, అటికెల మధు, కె.రవి, జోగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


