Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

గాజువాకలో ట్రాఫిక్ కష్టాలు.. రద్దీలో చిక్కుకున్న అంబులెన్స్!

Punnami Newsroom Published:
గాజువాకలో ట్రాఫిక్ కష్టాలు.. రద్దీలో చిక్కుకున్న అంబులెన్స్!

Story highlights

  • Uploaded Video:

– అత్యవసర వాహనాలకూ తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు – ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలంటున్న ప్రజలు

గాజువాక, నవంబర్ 11 (పున్నమి ప్రతినిధి):

గాజువాకలో ట్రాఫిక్ సమస్యలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రహదారులపై వాహనాల రద్దీ కారణంగా అత్యవసర సేవలకు సైతం ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనికి నిదర్శనంగా తాజాగా ఓ అంబులెన్స్ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్‌కు సైతం వాహనాల మధ్య దారి దొరకని పరిస్థితి కనిపిస్తోంది. అంబులెన్స్ సైరన్, ఎమర్జెన్సీ లైట్లు పనిచేస్తున్నప్పటికీ ట్రాఫిక్ రద్దీ కారణంగా ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గాజువాకలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ పెంచడంతో పాటు అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలకు ప్రత్యేకంగా మార్గం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఈ సమస్యపై ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Uploaded Video:

గాజువాకలో ట్రాఫిక్ కష్టాలు.. రద్దీలో చిక్కుకున్న అంబులెన్స్!

గాజువాకలో ట్రాఫిక్ కష్టాలు.. రద్దీలో చిక్కుకున్న అంబులెన్స్!

గాజువాకలో ట్రాఫిక్ కష్టాలు.. రద్దీలో చిక్కుకున్న అంబులెన్స్!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *