అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:11 పాడేరు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అరుకులోయ ప్రభుత్వ డిగ్రీ మహిళ కళాశాలలో మంగళవారం గంజాయి, డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలను వినియోగించడం వలన ఆరోగ్య, మానసిక సంబంధిత సమస్యలు, తోటి వారితో సరైన సంబందాలు లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడటానికి గల కారణలను, వాటి బారిన పడితే కలిగే నష్టాలను, గంజాయి, డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండటానికి పాటించవలసిన నియమాలను ఈగల్ సీఐ రమేష్ రుద్ర వివరించారు. డ్రగ్స్, గంజాయి నివారణకు ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాల నిరోదానికి సంబంధించిన ప్రతిజ్ఞను అధ్యాపకులు, విద్యార్థులు చేత చేయించడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ గురించి తెలియజేశారు. అలాగే మాదకద్రవ్యాల నిరోధక చట్టాలు, శిక్షలు గురించి జిల్లా ఎన్.డి.పి.ఎస్ సీఐ రవి కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు, అరకులోయ పోలీస్ స్టేషన్ సిబ్బంది అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

గంజాయి, మత్తుపదార్ధాలపై విద్యార్ధినిలకు అవగాహన
అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:11 పాడేరు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అరుకులోయ ప్రభుత్వ డిగ్రీ మహిళ కళాశాలలో మంగళవారం గంజాయి, డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలను వినియోగించడం వలన ఆరోగ్య, మానసిక సంబంధిత సమస్యలు, తోటి వారితో సరైన సంబందాలు లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడటానికి గల కారణలను, వాటి బారిన పడితే కలిగే నష్టాలను, గంజాయి, డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండటానికి పాటించవలసిన నియమాలను ఈగల్ సీఐ రమేష్ రుద్ర వివరించారు. డ్రగ్స్, గంజాయి నివారణకు ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాల నిరోదానికి సంబంధించిన ప్రతిజ్ఞను అధ్యాపకులు, విద్యార్థులు చేత చేయించడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ గురించి తెలియజేశారు. అలాగే మాదకద్రవ్యాల నిరోధక చట్టాలు, శిక్షలు గురించి జిల్లా ఎన్.డి.పి.ఎస్ సీఐ రవి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు, అరకులోయ పోలీస్ స్టేషన్ సిబ్బంది అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

