Wednesday, 11 March 2026
  • Home  
  • ఖేలో ఇండియా గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విశాఖ క్రీడాకారిణిలు
- విశాఖపట్నం

ఖేలో ఇండియా గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విశాఖ క్రీడాకారిణిలు

ఖేలో ఇండియా గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విశాఖ క్రీడాకారిణిలు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* ఖేలో ఇండియా అస్మిత పెన్ కాక్ సిలాట్ విమెన్స్ లీగ్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నాడు సబ్బవరంలో ఉన్న దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ లో జరిగింది. ఈ లీగ్ లో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం కు చెందిన దాదాపు 150 మంది క్రీడాకారిణీలు పాల్గొన్నారు. ఈ లీగ్ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన DSNLU ప్రస్తుత VC ప్రొఫెసర్.D. సూర్య ప్రకాశరావు గారు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం ఇటువంటి లీగ్ లు నిర్వహించడం ద్వారా వారిని మరింత దృఢంగా తయారుచేయవచ్చని పేర్కొన్నారు. ఈ లీగ్ ను డా ఆడారి కిషోర్ కుమార్ గారి అధ్యక్షతన మాస్టర్ వెంకట్ తదితరులు అద్భుతంగా నిర్వహించడం జరిగింది గౌరవ అతిథులుగా విచ్చేసిన ఉత్తరాంధ్ర పెన్ కాక్ సిలాట్ చీఫ్ పాట్రాన్ గురు దయమయ గారు మాట్లాడుతూ ఇది భారత ప్రభుత్వం చే గుర్తించబడిన ఆట కావున విద్యార్థులు కు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.సౌత్ జోన్ పెన్ కాక్ సిలాట్ అధ్యక్షులు P. మనోజ్ సాయి గారు మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణి లకు ఇది ఒక గొప్ప అవకాశం అని మార్షల్ ఆర్ట్స్ ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది” అని పేర్కొన్నారు. యాంటీ కరప్షన్ మరియు ఇంటెలిజెన్స్ కమిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడగల సన్యాసిరావు గారు మాట్లాడుతూ ” ఆడపిల్లలు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ స్థైర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. DSNLU స్పోర్ట్స్ పీడీ M. మంగ రాజు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ భాగ్య లక్ష్మీ గారు కూడా పాల్గొన్నారు. ఈ లీగ్ లో విశాఖ బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

ఖేలో ఇండియా గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విశాఖ క్రీడాకారిణిలు

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
ఖేలో ఇండియా అస్మిత పెన్ కాక్ సిలాట్ విమెన్స్ లీగ్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నాడు సబ్బవరంలో ఉన్న దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ లో జరిగింది. ఈ లీగ్ లో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం కు చెందిన దాదాపు 150 మంది క్రీడాకారిణీలు పాల్గొన్నారు.

ఈ లీగ్ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన DSNLU ప్రస్తుత VC ప్రొఫెసర్.D. సూర్య ప్రకాశరావు గారు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం ఇటువంటి లీగ్ లు నిర్వహించడం ద్వారా వారిని మరింత దృఢంగా తయారుచేయవచ్చని పేర్కొన్నారు. ఈ లీగ్ ను డా ఆడారి కిషోర్ కుమార్ గారి అధ్యక్షతన మాస్టర్ వెంకట్ తదితరులు అద్భుతంగా నిర్వహించడం జరిగింది

గౌరవ అతిథులుగా విచ్చేసిన ఉత్తరాంధ్ర పెన్ కాక్ సిలాట్ చీఫ్ పాట్రాన్ గురు దయమయ గారు మాట్లాడుతూ ఇది భారత ప్రభుత్వం చే గుర్తించబడిన ఆట కావున విద్యార్థులు కు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.సౌత్ జోన్ పెన్ కాక్ సిలాట్ అధ్యక్షులు P. మనోజ్ సాయి గారు మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణి లకు ఇది ఒక గొప్ప అవకాశం అని మార్షల్ ఆర్ట్స్ ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది” అని పేర్కొన్నారు. యాంటీ కరప్షన్ మరియు ఇంటెలిజెన్స్ కమిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడగల సన్యాసిరావు గారు మాట్లాడుతూ ” ఆడపిల్లలు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ స్థైర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. DSNLU స్పోర్ట్స్ పీడీ M. మంగ రాజు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ భాగ్య లక్ష్మీ గారు కూడా పాల్గొన్నారు.

ఈ లీగ్ లో విశాఖ బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.