ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలోని 21వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లలమర్రి రజిత–వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకుడు తలారి చంద్రశేఖర్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.
డివిజన్లో పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.



