*కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్యసమితి అవసరం: రాజ్ నాథ్ సింగ్*
న్యూఢిల్లీ నవంబర్ విశాఖ పున్నమి ప్రతినిధి:-
ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడానికి నేటి కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్యసమితి అవసరమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో జరిగిన ప్రపంచ ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్-హమాస్, ఉక్రెయిన్-రష్యా వంటి సంఘర్షణలు, సూడాన్‌లో మానవతా సంక్షోభాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి పాత్రపై ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థను సజీవంగా ఉంచడానికి సమతుల్య ప్రాతినిధ్యం, ప్రస్తుత కాలానికి అవసరమైన మార్పులు రావాలని ఆయన సూచించారు….


