Sunday, 22 March 2026
  • Home  
  • కొత్తపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఎన్ టి ఆర్ జిల్లా

కొత్తపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చందర్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పంచాయితీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) మరియు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై, కూటమి నాయకులతో కలిసి చందర్లపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.128.00 లక్షలుగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి రోడ్లు, గోడలు వంటి మౌలిక సదుపాయాలు కీలకమని, ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటు లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.

చందర్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పంచాయితీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) మరియు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై, కూటమి నాయకులతో కలిసి చందర్లపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.128.00 లక్షలుగా ఉందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి రోడ్లు, గోడలు వంటి మౌలిక సదుపాయాలు కీలకమని, ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటు లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.