-కొత్తపల్లి శ్రీ మాతమ్మ తల్లి గుడి అమ్మవారి విగ్రహానికి మరియు పిల్లర్స్ నిర్మాణానికి 50 వేల రూపాయల విరాళాన్ని అందించిన ముక్కా వరలక్ష్మి
-శ్రీ మాతమ్మ అమ్మవారి విగ్రహ మరియు గుడి పిల్లర్స్ నిర్మాణానికి ₹50,000/- ఇచ్చిన ముక్కా వరలక్ష్మి
ఓబులువారిపల్లి సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి)
ఓబులువారిపల్లి మండలం, కొత్తపల్లి అరుంధతి వాడకు చెందిన శ్రీ మాతమ్మ తల్లి విగ్రహం మరియు గుడి ఫిల్లర్స్ కోసం ₹50,000/- రూపాయల తన సొంత నిధుల నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి అందించారు.ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ –“ప్రతి గ్రామంలోని సాంప్రదాయ, ఆధ్యాత్మిక విలువలను కాపాడడం, సమర్థంగా ఎదుగుటలో సహాయం చేయడం ముఖ్యమైన కర్తవ్యం. ఈ సహాయం ద్వారా గుడి మరింత అద్భుతంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు,స్థానికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


