శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 14వ తేదీ శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించనున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీమార్గంలో తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుందని, దానికి ఎటువంటి అప్పీలు ఉండదని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వివిధ రకాల సివిల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని, రాజీకి లోబడే క్రిమినల్ కేసులను కూడా చర్చల ద్వారా ముగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే కోర్టులో పెండింగ్‌లో లేని ఫ్రీ లిటిగేషన్ కేసులను కూడా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను త్వరగా ముగించుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు సహకరించి ఎక్కువ కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జడ్జి శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు.

కేసుల వేగవంత పరిష్కారానికి లోక్ అదాలత్ – ప్రజలకు జడ్జి శ్రీనివాస్ నాయక్ పిలుపు