పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యాకే ఈవీఎంల చివరి రెండోరౌండ్ లెక్కింపు
సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
న్యూ ఢిల్లీ : పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే.. చివరి నుంచి రెండో రౌండ్ ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. నవంబరులో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నూతన విధానాన్ని తొలిసారి అమలు చేయనుంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉండే చోట్ల టేబుళ్లు, సిబ్బందిని సరిపడా ఏర్పాటు చేసుకుని లెక్కింపులో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది.


