చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్‌డివిజనల్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి కుల వివక్షతో ఉద్యోగులను అవమానించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ అధికారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా యూనిట్ డిమాండ్ చేసింది. బుధవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆ అధికారి తన వద్ద పనిచేసే సబ్‌ఆర్డినేట్లు ఏ.లవ్‌కుమార్, కే. భరత్‌లను కులం పేరుతో దూషించి, మానసిక వేధింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. చెప్పులు బయట వదిలి లోపలికి రావాలని ఆదేశించడం అవమానమని మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే రవీంద్రనాథ్‌రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతాధికారి హోదాలో కూర్చున్న వ్యక్తి కుల వివక్ష చూపించడం సిగ్గుచేటుందని, ప్రభుత్వం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భోజన విరామ నిరసనలు రేపటితో పాటు ఎల్లుండి కూడా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షురాలు ఆర్. విజయలక్ష్మి, నగర కోశాధికారి వెంకట చక్రధర్, సభ్యులు బుల్లెట్ భాష, నిర్మల, సుబ్బరత్నమ్మ, రషీద్, లక్ష్మణ్ నాయక్, ఆయేషా, సుమంత్, సుమన్, సుజాత, అనిత కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

కుల వివక్షతో ఉద్యోగుల అవమానం అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి నల్ల బ్యాడ్జీలతో నంద్యాల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిరసన