కంచికచర్ల మంగళవారంకీసర గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచంద్రరావు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటనపై ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ ఇన్సూరెన్స్ పథకంలో చేరిన పూర్ణచంద్ర రావు కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం అందజేశారు.
తెదేపా నేతలు, కార్యకర్తల సమక్షంలో సౌమ్య కీసర గ్రామంలోని ఆకుల కుటుంబ స్వగృహానికి వెళ్లి, పూర్ణచంద్ర రావు కుమారుడు ఆకుల గోపికృష్ణ చేతులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సౌమ్య కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ
“తెలుగుదేశం పార్టీ ప్రజా సేవా ధ్యేయంతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుంది. సభ్యుల సంక్షేమం కోసం పార్టీ అన్ని స్థాయిల్లో కృషి చేస్తుంది. ఈ ఆర్థిక సాయం పూర్ణచంద్రరావు కుటుంబానికి జీవనాధారంగా ఉపయోగపడాలి” అనిఅన్నారు.
ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మండల కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కీసరలో పూర్ణచంద్రరావు కుటుంబానికి ₹5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు తెదేపా సభ్యత్వ ఇన్సూరెన్స్ పథకం కింద మంజూరు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులమీదుగా అందజేత
కంచికచర్ల మంగళవారంకీసర గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచంద్రరావు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటనపై ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ ఇన్సూరెన్స్ పథకంలో చేరిన పూర్ణచంద్ర రావు కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం అందజేశారు. తెదేపా నేతలు, కార్యకర్తల సమక్షంలో సౌమ్య కీసర గ్రామంలోని ఆకుల కుటుంబ స్వగృహానికి వెళ్లి, పూర్ణచంద్ర రావు కుమారుడు ఆకుల గోపికృష్ణ చేతులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సౌమ్య కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ ప్రజా సేవా ధ్యేయంతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుంది. సభ్యుల సంక్షేమం కోసం పార్టీ అన్ని స్థాయిల్లో కృషి చేస్తుంది. ఈ ఆర్థిక సాయం పూర్ణచంద్రరావు కుటుంబానికి జీవనాధారంగా ఉపయోగపడాలి” అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మండల కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

