*బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ*
ఖమ్మం పున్నమి ప్రతినిధి.
కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ముఖ్య అతిధి గా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ..
నాడు కాంగ్రెస్ ప్రతి పక్షం లో ఉన్నప్పడు వరంగల్ లో రాహుల్ గాంధీ సాక్షం గా చేసిన రైతన్న ల మీద చేసిన తీర్మానము ని నేడు అధికార ము లో కి వచ్చిన తరువాత పెడ చెవిన పెట్టింది అని ఆ తీర్మానం ని వెంటనే అమలు చేయాలి అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేసారు
అధికారము లోకి రావడం కోసం రైతులని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది అని అన్నారు. ప్రధాన మంత్రి ఫజల్ బీమా ని అమలు చేయాలి అని, బేషరత్తు గా 2 లక్షలు రుణ మాఫీ అమలు చేయాలి అని బిజెపి రాష్ట్ర నాయాకులు గల్లా సత్య నారాయణ ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. ఎన్నికల కి ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకి హాయ్ చెప్పాడం ఎన్నికలు పూర్తి అయ్యాక బై చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం కి కొత్త కాదు అని ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అన్నారు. జిల్లా లో నకిలీ విత్తనాలు ని నివారణ చేయడం లో ప్రభుత్వం విఫలం అయింది అని జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా శ్యాం సుందర్ నాయక్, డీకోండశ్యాం, విజయ రెడ్డి, గజ్జల శ్రీనివాస్, అప్పారావ్, లక్ష్మి నారాయణ, నాగేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు


