గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.ఈ మేరకు జీవీఎంసీ 65 వ వార్డు కాకతీయ రోడ్ లో నూతనంగా నెలకొల్పిన కిడ్జీ పాఠశాల గాజువాక బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పాఠశాలలో కూడా మార్పులు ఎంతైనా అవసరమని,పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంలో పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.పిల్లల్లో మేధాశక్తిని పెంపొందించేలా విద్యాబుద్ధులు నేర్పాలని కోరారు.ఆధునిక పరిజ్ఞానం అనేది పౌరులను తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఒక మంచి లక్ష్యంతో పాఠశాలను నెలకొల్పడం పట్ల నిర్వాహకులను అభినందించారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల ఆవరణ ఉండటం వలన పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు,కార్పొరేటర్లు బొడ్డు నరసింహ పాత్రుడు,పల్లా శ్రీనివాస్,తిప్పల వంశీ రెడ్డి,గుడివాడ లతీష్,మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ,గాజువాక సీఐ పార్థసారథి, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు, గాజువాక ఎస్. ఐ సూర్యకాల, జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి, పోలరౌతు వెంకటరమణ,టిడిపి వార్డు అధ్యక్షుడు రట్టి వాసు,బైపిల్లి గాంధీ,కోరుకొండ మంగమ్మ,శ్రీలక్ష్మి,రాజు వెంకటేశ్వరరావు,పాఠశాల ప్రతినిధులు సురేష్,నీలిమ తదితరులు పాల్గొన్నారు


