Wednesday, 11 February 2026
  • Home  
  • కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- విశాఖపట్నం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఉక్కు నూతన డైరెక్టర్ పర్సనల్ కి ఐఎన్టియుసి వినతి స్టీల్ ప్లాంట్, పున్నమి ప్రతినిధి, ఫిబ్రవరి 11. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డైరెక్టర్ పర్సనల్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాకేష్ నందన్ సహాయ్ ని బుధవారం సాయంత్రం డైరెక్టర్ పర్సనల్ కార్యాలయంలో స్టీల్ ఐఎన్టియుసి అధ్యక్షులు పి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో కలిసి స్టీల్ ఐఎన్టియుసి తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ ఐ ఎన్ టి యు సి కార్యదర్శి మంత్రి రాజశేఖర్ డైరెక్టర్ పర్సనల్ తో మాట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికుల ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన డైరెక్టర్ పర్సనల్ కి విన్నవించడం జరిగినది. ముఖ్యంగా వేజ్ రివిజన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరగలేదునీ, కార్మికులకు గత సంవత్సరం నుండి పర్సంటేజ్ లెక్కన జీతాలు చెల్లించడం వలన పూర్తి జీతాలు పొందలేక పోయారునీ, గత సంవత్సరం నవంబర్ 15వ తారీఖున ఉద్యోగులకు కర్మాగారంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తాం అనే సర్క్లర్ విడుదల చేసి ఆనాటి నుండి ఉద్యోగులకు ఉత్పత్తి ఆధార జీతాలు చెల్లించడం జరుగుతున్నదినీ పర్సనల్ డైరెక్టర్ కి తెలియజేయడం జరిగినది. అలాగే HRA కూడా కార్మికులకు ఇవ్వకుండా నిలుపుదల చేశారనీ, ఉక్కనగరంలో నివాసముంటున్న ఉద్యోగులకు కరెంట్ బిల్లు పెంచేశారనీ, ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి , ఆధార్ కార్డుని బ్లాక్ చేయడం జరిగినదినీ, ఉద్యోగులకి ఇప్పటివరకు రావలసిన పెండింగ్ జీతాలు ముఖ్యంగా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఐఎన్టియుసి సీనియర్ నాయకులు మద్ది అప్పలరాజు, జి.మధు, చట్టి సింహాచలం, కోరాడ వెంకటరావు, వంగలపూడి ఈశ్వరరావు నేలతాటి రాజు, తలారి శివ మొదలగు నాయకులు పాల్గొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఉక్కు నూతన డైరెక్టర్ పర్సనల్ కి ఐఎన్టియుసి వినతి

స్టీల్ ప్లాంట్, పున్నమి ప్రతినిధి, ఫిబ్రవరి 11.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డైరెక్టర్ పర్సనల్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాకేష్ నందన్ సహాయ్ ని బుధవారం సాయంత్రం డైరెక్టర్ పర్సనల్ కార్యాలయంలో స్టీల్ ఐఎన్టియుసి అధ్యక్షులు పి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో కలిసి స్టీల్ ఐఎన్టియుసి తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ ఐ ఎన్ టి యు సి కార్యదర్శి మంత్రి రాజశేఖర్ డైరెక్టర్ పర్సనల్ తో మాట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికుల ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన డైరెక్టర్ పర్సనల్ కి విన్నవించడం జరిగినది. ముఖ్యంగా వేజ్ రివిజన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరగలేదునీ, కార్మికులకు గత సంవత్సరం నుండి పర్సంటేజ్ లెక్కన జీతాలు చెల్లించడం వలన పూర్తి జీతాలు పొందలేక పోయారునీ, గత సంవత్సరం నవంబర్ 15వ తారీఖున ఉద్యోగులకు కర్మాగారంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తాం అనే సర్క్లర్ విడుదల చేసి ఆనాటి నుండి ఉద్యోగులకు ఉత్పత్తి ఆధార జీతాలు చెల్లించడం జరుగుతున్నదినీ పర్సనల్ డైరెక్టర్ కి తెలియజేయడం జరిగినది. అలాగే HRA కూడా కార్మికులకు ఇవ్వకుండా నిలుపుదల చేశారనీ, ఉక్కనగరంలో నివాసముంటున్న ఉద్యోగులకు కరెంట్ బిల్లు పెంచేశారనీ, ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి , ఆధార్ కార్డుని బ్లాక్ చేయడం జరిగినదినీ, ఉద్యోగులకి ఇప్పటివరకు రావలసిన పెండింగ్ జీతాలు ముఖ్యంగా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఐఎన్టియుసి సీనియర్ నాయకులు మద్ది అప్పలరాజు, జి.మధు, చట్టి సింహాచలం, కోరాడ వెంకటరావు, వంగలపూడి ఈశ్వరరావు నేలతాటి రాజు, తలారి శివ మొదలగు నాయకులు పాల్గొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.