జాగృతి మహిళా అధ్యక్షురాలు బి.వసంత
కామారెడ్డి, 28 జనవరి, ( పున్నమి ప్రతినిధి )
కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఉత్కం ఠ రేపోతుండగా, జాగృతి మహిళా అధ్యక్షురాలు బి.వసంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ మార్గదర్శకత్వంలో జాగృతి నాయకులు, మహిళలు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు ప్రకటించా రు.మీడియా సమావేశంలోజిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు బి.వసంత మాట్లాడుతూ, పలు వార్డుల్లో మా అభ్యర్థులు సింహం గుర్తుతో బలంగా పోటీ పడుతామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం మా నాయకులు కట్టు బడి పోరాటం చేస్తారని స్పష్టం చేశారు.ఈ ఎన్నిక ల్లో పట్టణ ప్రజల అంచనాలనం అంగీకరిస్తూ, స్థాని క సమస్యలపై దృష్టి పెట్టి పోటీ చేస్తామని ధైర్యంగా ప్రకటించారు.ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్, జిల్లా రైతు అధ్యక్షుడు రాజు, మహిళా ఉపాధ్యక్షు రాలు శమంత, జాగృతి స్టూడెంట్ అధ్యక్షులు రాజేష్, రాము, శివ, వినోద్, అఫ్రిన్, కౌన్సిలర్ అభ్య ర్థి కురుమ సతీష్, మమత బేగం, ప్రియాంక, నాయకులు పాల్గొన్నారు.



