Thursday, 5 March 2026
  • Home  
  • కామారెడ్డిలో సమ్మెపై వినతి పత్రాలు
- కామారెడ్డి

కామారెడ్డిలో సమ్మెపై వినతి పత్రాలు

కామారెడ్డి, 13 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : దసరా నుంచి సంక్రాంతి వరకు వేతనాలు రాకపోవడంతో ఎన్‌హెచ్‌ఎం (జాతీయ ఆరోగ్య మిషన్) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తక్కువ జీతాలతో, ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ప్రజల ఆరోగ్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు పల్లెలు, సామాన్య ప్రజల వరకు చేరేలా చేస్తున్నా మని వారు తెలిపారు.ఈ బుధవారం జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఎం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డీఎంహెచ్‌ఓకు, బాన్సువాడ ఆర్‌ఎంఓ డాక్టర్ సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న వేతన భత్యాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జనవరి 14 నుంచి 21 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యారోగ్య సేవలు కొనసా గిస్తూ నిరసన తెలియజేస్తామని హెచ్చరించా రు.ఈ నెల 21 వరకు జీతాలు రాకపోతే 22వ తేదీ నుంచి సమ్మె తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించా లని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్‌హె చ్‌ఎం ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు ఆక్షేపించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయ కులు తాళ్లపల్లి సుమన్, వెంకటరమణ, రాజు, శ్రీకాంత్, పద్మజ, అశ్విని, సుభాషిణి, శోభ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి, 13 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

దసరా నుంచి సంక్రాంతి వరకు వేతనాలు రాకపోవడంతో ఎన్‌హెచ్‌ఎం (జాతీయ ఆరోగ్య మిషన్) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తక్కువ జీతాలతో, ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ప్రజల ఆరోగ్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు పల్లెలు, సామాన్య ప్రజల వరకు చేరేలా చేస్తున్నా మని వారు తెలిపారు.ఈ బుధవారం జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఎం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డీఎంహెచ్‌ఓకు, బాన్సువాడ ఆర్‌ఎంఓ డాక్టర్ సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న వేతన భత్యాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జనవరి 14 నుంచి 21 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యారోగ్య సేవలు కొనసా గిస్తూ నిరసన తెలియజేస్తామని హెచ్చరించా రు.ఈ నెల 21 వరకు జీతాలు రాకపోతే 22వ తేదీ నుంచి సమ్మె తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించా లని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్‌హె చ్‌ఎం ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు ఆక్షేపించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయ కులు తాళ్లపల్లి సుమన్, వెంకటరమణ, రాజు, శ్రీకాంత్, పద్మజ, అశ్విని, సుభాషిణి, శోభ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.