Monday, 23 March 2026
  • Home  
  • కళాశాలల నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలింది గత ప్రభుత్వమే పీపీపీతో పేదలకు ఉచిత వైద్యం–విద్య అందుతుందని స్పష్టం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ నాయకత్వ ఘాటైన స్పందన
- ఎన్ టి ఆర్ జిల్లా

కళాశాలల నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలింది గత ప్రభుత్వమే పీపీపీతో పేదలకు ఉచిత వైద్యం–విద్య అందుతుందని స్పష్టం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ నాయకత్వ ఘాటైన స్పందన

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంపై నిన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు చేసిన విమర్శలను నందిగామ టీడీపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య పద్ధతులు కానని, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చేం దుకే దుష్ప్రచారం” టీడీపీ నేతల వివరాల ప్రకారం— 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన ₹8,480 కోట్లలో కేవలం ₹1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, మిగతా నిధులను ఇతర పనులకు మళ్లించడం వల్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయా యని ఆరోపించారు. “గతప్రభుత్వ పనితీరుతో వెళ్లి ఉంటే ఈ కళాశాలలు పూర్తవడానికి కనీసం 20–23 సంవత్సరాలు పట్టేది. పేదలకు వైద్యం, యువతకు వైద్య విద్య అందుబాటులోకి రాకుండా ఆలస్యం చేసింది ఇదే ప్రభుత్వమే” అని టీడీపీ నాయకులు విమర్శించారు. “నిజమైన ప్రైవేటీకరణ చేసిందెవరు?” వైద్య విద్యలో ప్రభుత్వ సీట్ల ఫీజులను ₹12 లక్షల నుంచి ₹20 లక్షలకు పెంచిన ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్’ మోడల్‌ను గత ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తుచేశారు. “అది నిజమైన ప్రైవేటీకరణ. ఇప్పుడు పీపీపీపై అబద్ధాలు చెప్పడం నిస్సిగ్గు రాజకీయమే” అని నేతలు వ్యాఖ్యానించారు. *పీపీపీతో లభించే ప్రయోజనాలు* ప్రభుత్వం స్పష్టంచేసిన పీపీపీ విధానం వివరాలను టీడీపీ నేతలు మీడియాకు తెలియజేశారు: కళాశాలలు 100% ప్రభుత్వ యాజమాన్యంలోని వారేనని సీట్లలో 50%పేద–మధ్యతరగతి విద్యార్థులకు పూర్తిగా ఉచితమని, ఆసుపత్రులలో 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచిత చికిత్స కోసం కేటాయించనున్నారని, ఆలస్యాలను నివారిస్తూ ఆధునిక మౌలిక వసతులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నమని చెప్పారు. “పీపీపీ అంటే ప్రజల భాగ స్వామ్యం ప్రైవేటీకరణ కాదు” ప్రజల ఆరోగ్యం, విద్యను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో లేనివేననిఅర్ధమవుతోందన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంపై నిన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు చేసిన విమర్శలను నందిగామ టీడీపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య పద్ధతులు కానని, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చేం దుకే దుష్ప్రచారం” టీడీపీ నేతల వివరాల ప్రకారం—
17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన ₹8,480 కోట్లలో కేవలం ₹1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, మిగతా నిధులను ఇతర పనులకు మళ్లించడం వల్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయా యని ఆరోపించారు. “గతప్రభుత్వ పనితీరుతో వెళ్లి ఉంటే ఈ కళాశాలలు పూర్తవడానికి కనీసం 20–23 సంవత్సరాలు పట్టేది. పేదలకు వైద్యం, యువతకు వైద్య విద్య అందుబాటులోకి రాకుండా ఆలస్యం చేసింది ఇదే ప్రభుత్వమే” అని టీడీపీ నాయకులు విమర్శించారు.
“నిజమైన ప్రైవేటీకరణ చేసిందెవరు?”
వైద్య విద్యలో ప్రభుత్వ సీట్ల ఫీజులను ₹12 లక్షల నుంచి ₹20 లక్షలకు పెంచిన ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్’ మోడల్‌ను గత ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తుచేశారు. “అది నిజమైన ప్రైవేటీకరణ. ఇప్పుడు పీపీపీపై అబద్ధాలు చెప్పడం నిస్సిగ్గు రాజకీయమే” అని నేతలు వ్యాఖ్యానించారు.
*పీపీపీతో లభించే ప్రయోజనాలు*
ప్రభుత్వం స్పష్టంచేసిన పీపీపీ విధానం వివరాలను టీడీపీ నేతలు మీడియాకు తెలియజేశారు:
కళాశాలలు 100% ప్రభుత్వ యాజమాన్యంలోని వారేనని
సీట్లలో 50%పేద–మధ్యతరగతి విద్యార్థులకు పూర్తిగా ఉచితమని,
ఆసుపత్రులలో 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచిత చికిత్స కోసం కేటాయించనున్నారని,
ఆలస్యాలను నివారిస్తూ ఆధునిక మౌలిక వసతులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నమని చెప్పారు.
“పీపీపీ అంటే ప్రజల భాగ స్వామ్యం ప్రైవేటీకరణ కాదు”
ప్రజల ఆరోగ్యం, విద్యను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో లేనివేననిఅర్ధమవుతోందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.