Wednesday, 11 February 2026
  • Home  
  • కల్లిపూడిగ్రామస్తుల కష్టానికి తెరదించిన ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి
- తిరుపతి

కల్లిపూడిగ్రామస్తుల కష్టానికి తెరదించిన ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తొట్టంబేడు మండలం, తాటిపర్తి పంచాయతీ పరిధిలోని కల్లిపూడి గ్రామానికి సమీపంలో ఉన్న తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువపై స్మశానానికి వెళ్లేందుకు నిర్మించిన చిన్న బ్రిడ్జి పూర్తికావడంతో గ్రామస్తుల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామంలో ఇప్పటివరకు ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలువ దాటాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. కాలు జారితే కాలువలో పడే ప్రమాదం ఉండేదని గ్రామస్తులు వాపోయారు. గతంలో ఇదే కాలువ వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు. గత వైసీపీ పాలనలో పట్టించుకోని ప్రజల గోడు గ్రామస్తులు ఈ సమస్యను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా, బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదంటూ అవహేళన చేసిన సందర్భాలున్నాయని దశాబ్దాలుగా ప్రజలు పోరాడినా, వారి గోడు పాలకులకు వినిపించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో ఇచ్చిన మాట – అధికారంలోకి రాగానే కార్యరూపం దాల్చరన్నారు. గత ఎన్నికల సమయంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా కల్లిపూడి గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తాము గెలిచిన వెంటనే ఈ బ్రిడ్జిని మొదటి పనిగా పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారని ఆ మాటను ఈరోజు నిలబెట్టుకుంటూ, ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు. వర్షాలు, కాలువ ప్రవాహం… అయినా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి భారీ వర్షాలు, నిండుగా ప్రవహించే తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువ కారణంగా పనుల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి మోటార్ల సహాయంతో నీటిని తొలగిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులను కొనసాగించారని వర్షకాలంలో పనులు చేయడం చాలా కష్టంగా మారిందని కాంట్రాక్టర్ వెల్లడించారు. బ్రిడ్జి బాధ్యత మొత్తం భుజాన వేసుకున్న బొజ్జల రిషితా రెడ్డి బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి కీలక పాత్ర పోషించారు. కల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని, గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపి పనులను పర్యవేక్షించారు.రూ. 22.50 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించి, నేడు ప్రజలకు అంకితం చేశారు.

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తొట్టంబేడు మండలం, తాటిపర్తి పంచాయతీ పరిధిలోని కల్లిపూడి గ్రామానికి సమీపంలో ఉన్న తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువపై స్మశానానికి వెళ్లేందుకు నిర్మించిన చిన్న బ్రిడ్జి పూర్తికావడంతో గ్రామస్తుల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామంలో ఇప్పటివరకు ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలువ దాటాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. కాలు జారితే కాలువలో పడే ప్రమాదం ఉండేదని గ్రామస్తులు వాపోయారు. గతంలో ఇదే కాలువ వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.
గత వైసీపీ పాలనలో పట్టించుకోని ప్రజల గోడు
గ్రామస్తులు ఈ సమస్యను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా, బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదంటూ అవహేళన చేసిన సందర్భాలున్నాయని దశాబ్దాలుగా ప్రజలు పోరాడినా, వారి గోడు పాలకులకు వినిపించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో ఇచ్చిన మాట – అధికారంలోకి రాగానే కార్యరూపం దాల్చరన్నారు. గత ఎన్నికల సమయంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా కల్లిపూడి గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తాము గెలిచిన వెంటనే ఈ బ్రిడ్జిని మొదటి పనిగా పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారని ఆ మాటను ఈరోజు నిలబెట్టుకుంటూ, ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు. వర్షాలు, కాలువ ప్రవాహం… అయినా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి భారీ వర్షాలు, నిండుగా ప్రవహించే తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువ కారణంగా పనుల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి మోటార్ల సహాయంతో నీటిని తొలగిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులను కొనసాగించారని వర్షకాలంలో పనులు చేయడం చాలా కష్టంగా మారిందని కాంట్రాక్టర్ వెల్లడించారు.
బ్రిడ్జి బాధ్యత మొత్తం భుజాన వేసుకున్న బొజ్జల రిషితా రెడ్డి
బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి కీలక పాత్ర పోషించారు. కల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని, గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపి పనులను పర్యవేక్షించారు.రూ. 22.50 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించి, నేడు ప్రజలకు అంకితం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.