Sunday, 5 April 2026
  • Home  
  • *కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని యాచారం తాసిల్దార్…!*
- E-పేపర్

*కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని యాచారం తాసిల్దార్…!*

*కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని యాచారం తాసిల్దార్…!* పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్: *యాచారం ఏప్రిల్ 01()*:-రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,మాల్ గ్రామంలోని నల్లవెల్లి రెవెన్యూ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 567,531 లలో ఖాళీ స్థలాలకు గతంలో పనిచేసిన సెక్రెటరీ ఇంటి నెంబర్లు మంజూరు చేసినట్టు జనవరి 12న జిల్లా కార్యాలయంలో కలెక్టర్ కి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు అందింది.అట్టి ఫిర్యాదు పై జనవరి 20 తేదీ లోపు నివేదిక సమర్పించాలని,అట్టి వివాద భూమికి కంచెను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించగా నేటికీ ఆ భూమిలో కంచె ఏర్పాటు చేయకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతుంది.కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమిని కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని వారి పనితీరు ద్వారా…పలువురు చర్చించుకుంటున్నారు.జిల్లా పాలనాధికారి ఆదేశాలను లెక్కచేయకుండా తాసిల్దార్ విధులు నిర్వహించడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్ ఆదేశాలనే లెక్క చేయని అధికారులు సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కలగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫిర్యాదు పై మండల స్థాయి అధికారులను వివరణ కోరగా ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం ఇవ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

*కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని యాచారం తాసిల్దార్…!*

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్:

*యాచారం ఏప్రిల్ 01()*:-రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,మాల్ గ్రామంలోని నల్లవెల్లి రెవెన్యూ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 567,531 లలో ఖాళీ స్థలాలకు గతంలో పనిచేసిన సెక్రెటరీ ఇంటి నెంబర్లు మంజూరు చేసినట్టు జనవరి 12న జిల్లా కార్యాలయంలో కలెక్టర్ కి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు అందింది.అట్టి ఫిర్యాదు పై జనవరి 20 తేదీ లోపు నివేదిక సమర్పించాలని,అట్టి వివాద భూమికి కంచెను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించగా నేటికీ ఆ భూమిలో కంచె ఏర్పాటు చేయకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతుంది.కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమిని కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని వారి పనితీరు ద్వారా…పలువురు చర్చించుకుంటున్నారు.జిల్లా పాలనాధికారి ఆదేశాలను లెక్కచేయకుండా తాసిల్దార్ విధులు నిర్వహించడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్ ఆదేశాలనే లెక్క చేయని అధికారులు సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కలగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫిర్యాదు పై మండల స్థాయి అధికారులను వివరణ కోరగా ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం ఇవ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.