Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

కలిగిరిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Punnami Newsroom Published:
కలిగిరిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Story highlights

  • కలిగిరి, నవంబర్: స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలిగిరి పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.
  • ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టణంలోని ఎస్టీ కాలనీ (7వ వార్డు), 9వ, 10వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.
  • ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కూటమి మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న షేక్ ఫాతిమా బేగంకు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.

కలిగిరి, నవంబర్: స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలిగిరి పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టణంలోని ఎస్టీ కాలనీ (7వ వార్డు), 9వ, 10వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కూటమి మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న షేక్ ఫాతిమా బేగంకు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. అలాగే కూటమి తరఫున బరిలో నిలిచిన 14 మంది వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *